Idream media
Idream media
కాంగ్రెస్ పార్టీ నేత, సోనియా గాంధీ కుమార్తె ప్రియాంకా గాంధీ సంచలన వ్యాఖ్యాలు చేశారు. తనపై లక్నో పోలీసులు చేయిచేసుకున్నారని ఆరోపించారు. సీఏఏ నిరసనల్లో పాల్గొన్న రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్ ఎస్‌ఆర్ దారాపురిని పోలీసులు అరెస్ట్ చేయడంతో ఆయన్ను పరామర్శించేందుకు ప్రియాంక వెళ్లేందుకు ప్రయత్నించడంతో పోలీసులు అడ్డుకున్నారు.
తన వాహనాన్ని అడ్డుకున్నారని. దిగి నడిచి వెళుతుండగా ఓ మహిళా పోలీసు తన గొంతు పట్టుకుని లాగారని ప్రియాంక ఆరోపించారు. మరొక మహిళా పోలీసులు వెనక్కి నెట్టడంతో తాను పడిపోయాయనని పేర్కొన్నారు. అయితే వారి నుంచి తప్పించుకుని చివరి దారాపురి నివాశానికి చేరుకున్నట్లు ప్రియాంక తెలిపారు.