మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుకు ఎన్సిపి, శివసేన,కాంగ్రెస్ మధ్య పొత్తు కుదరకపోవడంతో గవర్నర్ భగత్ సింగ్ కోషియారీ రాష్ట్రపతి పాలనకు సిఫార్సు చేసారు. ఈ విషయంగా బ్రిక్స్ సదస్సుకు బయలుదేరడానికి ముందు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కేంద్ర క్యాబినెట్ తో సమావేశం అయ్యారు. ఆ సమావేశంలో రాష్ట్రపతి పాలనకు ఆమోదముద్ర వేసి ఆ ఫైల్ ని రాష్ట్రపతికి పంపించారు. రాష్ట్రపతి రామ్ నాధ్ కోవింద్ కూడా దానికి ఆమోదముద్ర వేయడంతో మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన మొదలుకానుంది.
దీనిపై శివసేన భగ్గుమంది. బీజేపీ కి ఇచ్చినంత గడువు తమకి ఇవ్వలేదని శివసేన సుప్రీం కోర్ట్ లో పిటిషన్ వేసిన సంగతి విదితమే. రాష్ట్రపతి పాలన విధించిన ఆరు నెలల్లోగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయకపోతే ఎన్నికలు మళ్ళీ నిర్వహించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు.