iDreamPost
android-app
ios-app

ప్రభాస్ స్పీడ్ మామూలుగా లేదు!

  • Published Jan 19, 2023 | 11:56 AM Updated Updated Jan 19, 2023 | 11:56 AM
  • Published Jan 19, 2023 | 11:56 AMUpdated Jan 19, 2023 | 11:56 AM
ప్రభాస్ స్పీడ్ మామూలుగా లేదు!

కొందరు హీరోలు పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు వచ్చాక దానిని కాపాడుకోవడం కోసం ఆచి తూచి సినిమాలు చేస్తున్నారు. కానీ అందరికంటే ముందుగా పాన్ ఇండియా స్టార్ గా మారిన ప్రభాస్ మాత్రం.. వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. చిన్న, మీడియం రేంజ్ హీరోల కంటే స్పీడ్ గా సినిమాలు చేస్తూ ఆశ్చర్యపరుస్తున్నాడు.

బాహుబలి తర్వాత సాహో, రాధేశ్యామ్ చిత్రాలతో నిరాశపరిచిన ప్రభాస్ ఈసారి ఆసక్తికరమైన లైనప్ తో సంచలనాలు సృష్టించడానికి సిద్ధమవుతున్నాడు.
ఈ ఏడాది ప్రభాస్ ‘ఆదిపురుష్’, ‘సలార్’ చిత్రాలతో అలరించనున్నాడు. ఇందులో ‘సలార్’ మూవీ బాహుబలి, కేజీఎఫ్ తరహాలో రెండు భాగాలుగా రానుందని అంటున్నారు. అలాగే ‘ప్రాజెక్ట్ కె’ మూవీ కూడా ఈ ఏడాది చివరిలో లేదా వచ్చే ఏడాది ప్రథమార్థంలో రానుంది. ఈ మూడు సినిమాలపైనా భారీ అంచనాలు ఉన్నాయి. ముఖ్యంగా సలార్, ప్రాజెక్ట్ కె చిత్రాలు పాన్ ఇండియా, పాన్ వరల్డ్ రేంజ్ లో సంచలనాలు సృష్టించడం ఖాయమనే అభిప్రాయాలు ఉన్నాయి. ఇలా వరుస భారీ చిత్రాలు చేస్తున్న ప్రభాస్ ఊహించని విధంగా ఇంకా అధికారికంగా ప్రకటించకుండానే మారుతి దర్శకత్వంలో సైలెంట్ గా ఓ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాపై అంచనాలైతే లేవు గానీ సర్ ప్రైజ్ హిట్ అవుతుందనే అభిప్రాయాలు ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్నాయి.

అంటే షూటింగ్ దశలోనూ, పోస్ట్ ప్రొడక్షన్ దశలోనూ ప్రభాస్ నటిస్తున్నవి నాలుగు సినిమాలు ఉన్నాయి. వీటితో పాటు అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో స్పిరిట్ అనే చిత్రాన్ని ప్రకటించాడు. ప్రభాస్ పవర్ ఫుల్ పోలీస్ గా కనిపించనున్న ఈ మూవీ ఈ ఏడాది చివరిలో మొదలు కానుంది. ఇవి చాలవు అన్నట్లు మరో రెండు ప్రాజెక్ట్ లు వచ్చి ప్రభాస్ లిస్టులో చేరాయి. మైత్రి మూవీస్ బ్యానర్ లో సిద్ధార్థ్ ఆనంద్ దర్శత్వంలో ఓ సినిమా చేయనున్నాడు. దీనితో పాటు దిల్ రాజు నిర్మాణంలో ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ‘రావణం’లో కూడా ప్రభాస్ నటించనున్నాడని ఇండస్ట్రీ వర్గాల టాక్.

ఈ లెక్కన ప్రస్తుతం ప్రభాస్ చేతిలో ఏకంగా ఏడు సినిమాలు ఉన్నాయి. అందులో ఏడాది గ్యాప్ లోనే కనీసం మూడు సినిమాలు విడుదల కానున్నాయి. అందులో రెండు సినిమాలు హిట్ అయినా చాలు ప్రభాస్ ఎవరూ ఊహించని స్ధాయికి వెళ్ళిపోతాడు అనడంలో ఆశ్చర్యం లేదు.

Jojobet GirişjojobetJojobetİmajbetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişbetcio