iDreamPost
android-app
ios-app

టీడీపీకి షాక్ – ఎమ్మెల్సీ రాజీనామా

  • Published Oct 28, 2020 | 8:24 AM Updated Updated Oct 28, 2020 | 8:24 AM
టీడీపీకి షాక్ – ఎమ్మెల్సీ రాజీనామా

పరిటాల కుటుంబానికి అత్యంత విశ్వాసపాత్రులుగా , తెలుగుదేశానికి బలమైన మద్దతుదారులగా ఉంటు వస్తున్న పోతుల సునీత టీడీపీకి షాక్ ఇచ్చారు. తన శాసన మండలి సభ్యత్వానికి రాజీనామా చేస్తూ ఆ లేఖని శాసన మండలి చైర్మన్ షరీఫ్ కు పంపించారు. చంద్రబాబు నాయుడు 15 నెలలుగా అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలని విభేదిస్తున్నానంటు ఆమె లేఖలో పేర్కొన్నారు. బడుగు బలహీన వర్గాల అభ్యుదయం కోసం జగన్ సర్కార్ పాటుబడుతున్నారని అందుకే ప్రభుత్వానికి తన సంపూర్ణ పూర్తి మద్దతు ప్రకటిస్తున్నట్టు చెప్పుకొచ్చారు.

శాసన మండలిలో తెలుగుదేశం ప్రవేశ పెట్టిన రూల్ 71 కి విప్ ధిక్కరించి వ్యతిరేకంగా ఓటు వేసి సొంత పార్టీకే షాక్ ఇచ్చిన పోతుల సునీతపై ఇప్పటికే ఆ పార్టీ అనర్హత పిటీషన్ దాఖలు చేయగా అది స్పీకర్ దగ్గర కొద్ది నెలలుగా పెండింగ్ లోనే ఉంది. అనర్హత పిటిషన్ పై విచారణ జరుగుతున్న సమయంలోనే ఆమె రాజీనామా చేస్తూ తెలుగుదేశానికి షాక్ ఇచ్చారు.