మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. బీఎస్ 3 వాహనాలను.. బీఎస్ 4 వాహనాలుగా చూపుతూ నడుపుతున్న వ్యవహారంలో జేసీకి చెందిన నాలుగు టిప్పర్లను ఇటీవల రవాణాశాఖ అధికారులు సీజ్ చేశారు. పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారంలో విచారణ చేపట్టిన పోలీసులు జేసీ ప్రభాకర్‌పై కేసు నమోదు చేశారు.
అంతకు ముందు లారీ ఓనర్లు జేసీ ప్రభాకర్ ఇంటి ముందు ధర్నాకు దిగారు. తమ లారీ నంబర్లను అక్రమంగా వాడుకున్న కారణంగా అనవసరంగా తమ లారీలు సీజ్ అయ్యాయంటూ లారీ ఓనర్లు జేసీ ప్రభాకర్‌పై మండిపడ్డారు. ధర్నా చేస్తున్న లారీ యజమానులను పోలీసులు స్టేషన్‌కు తరలించారు. కాగా, లారీ ఓనర్లు తమ ఇంటి ముందు ధర్నా చేయడంలో అధికార పార్టీ నేతల హస్తం ఉన్నట్లు జేసీ ప్రభాకర్ రెడ్డి ఆరోపించారు. అధికార పార్టీ నేతల ప్రొద్భలంతోనే ఓనర్లు తమ ఇంటి ముందుకు వచ్చారని మండిపడ్డారు.