iDreamPost
android-app
ios-app

16.50 కోట్లు పక్కదారి.. తూర్పులో టీడీపీ నేతలపై కేసు

  • Published Aug 28, 2020 | 2:57 PM Updated Updated Aug 28, 2020 | 2:57 PM
16.50 కోట్లు పక్కదారి.. తూర్పులో టీడీపీ నేతలపై కేసు

తెలుగుదేశం పార్టీ హయాంలో వ్యవస్థలను ఛిధ్రం చేసి, కొనసాగించిన అక్రమాలు అన్నీ, ఇన్నీ కావు. తాజాగా జరుపుతున్న విచారణల్లో అవి ఒకొక్కటిగా బైటకు వస్తున్నాయి. తాజాగా తూర్పు గోదావరి జిల్లాలో టీడీపీ నేత వరుపుల రాజాపై పోలీస్‌లు కేసు నమోదు చేసారు. జిల్లాలోని లంపకలోవ వ్యవసాయ సహకార సంఘంలో రూ. 16కోట్ల యాభైలక్షల రూపాయలు రైతులకు రుణాలు పేరిట పక్కదారి పట్టాయని విచారణలో తేలింది.

అప్పట్లో వరుపుల రాజా ప్రోద్భలంతో 450 నకిలీ పాస్‌పుస్తకాలతో ఈ మొత్తాన్ని పొందినట్లు పోలీస్‌లు తేల్చారు. దీంతో అప్పటి అధ్యక్షుడు రాజాతో పాటు, ఆనాటి సొసైటీ ఉద్యోగులు నలుగురిపై కూడా ప్రత్తిపాడు పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదు చేసారు. అసలు రైతులకు తెలియకుండా, చనిపోయిన రైతుల పేరిట కూడా స్వల్పకాలిక రుణాల పేరిట ఈ మొత్తం నిధులను దుర్వినియోగం చేసారు. దీంతో వాస్తవంగా అర్హులైన రైతులకు రుణాలు సక్రమంగా అందకుండా పోయాయి.

అప్పట్లో అధికారాన్ని అడ్డంపెట్టుకుని పాల్పడిన ఈ దుశ్చర్యను గురించి ప్రత్తిపాడు ఎమ్మెల్యే పర్వత పూర్ణచంద్రప్రసాద్‌ గత అసెంబ్లీలో ప్రస్తావించారు. ఈ నేపథ్యంలో సీయం వైఎస్‌ జగన్‌ విచారణకు ఆదేశించడంతో టీడీపీ అధికారాన్ని అడ్డంపెట్టుకుని పాల్పడిన అక్రమాలన్నీ వెలుగు చూస్తున్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ నుంచి టీడీపీలోకి జంప్‌ అయిన వరుపుల సుబ్బారావును కాదని, ఆయనకు మనుమడి వరుసైన వరుపుల రాజాకు ప్రత్తిపాడు నుంచి పోటీ చేసేందుకు చంద్రబాబు సీటిచ్చారు. ఆ ఎన్నికల్లో ఓటమిపాలయ్యారు.