iDreamPost
iDreamPost
టీడీపీకి చెందిన ఆళ్లగడ్డ నేత ఏవీ సుబ్బారెడ్డిని హత్య చేసేందుకు పన్నిన కుట్రను పొలీసులు చేదించినట్టు తెలుస్తుంది. మార్చ్ నెలలో సుబ్బారెడ్డిని హత్య చేసేందుకు ముగ్గురు వ్యక్తులు రెక్కీ నిర్వహిస్తుండగా కడప పోలీసులు నిందితులని అదుపులోకి తీసుకుని వారి నుండి ఒక పిస్టల్, ఆరు బుల్లెట్లు, 3.20 లక్షలు నగదు కూడా స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే ఈ హత్య చేసేందుకు కుట్ర పన్నిన వారి వెనక భూమా అఖిల ప్రియ , ఆమె భర్త భార్గవ్ హస్తం ఉందని నిందితులు పోలీసుల విచారణలో తెలిపినట్టు గతంలో వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు తాజాగా సుబ్బారెడ్డి పై హత్యాయత్నం కేసులో ముఖ్య సూత్రధారిని అరెస్ట్ చేసినట్టు తెలుస్తుంది .
ఇప్పుడు అరెస్టు చేసిన వ్యక్తి మాజీ మంత్రి అఖిలప్రియ భర్త భార్గవ్ పీఏ మాదా శ్రీనివాసులని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. సుబ్బారెడ్డి హత్యకు సుఫారి శ్రీనివాసుల చేతినుండే నిందితులకి అందిందని పోలీసులు గుర్తించినట్టు సమాచారం . నిందితులు ఇచ్చిన సమాచారంతో భార్గవ్ పీఏ మాదా శ్రీనివాసులని పొలీసులు అదుపులోకి తీసుకునట్టు తెలుస్తుంది. భూమా నాగి రెడ్డి మరణం తరువాత భూమా కుటుంభానికి , ఏ.వి కుటుంభానికి మద్య విభేదాలు వచ్చిన విషయం తెలిసిందే. గడిచిన ఎన్నికల్లో ఏవీ సుబ్బారెడ్డి వర్గం తమకు సహకరించలేదని అఖిలప్రియ ఆరోపించడం గమనార్హం.