iDreamPost
android-app
ios-app

అపూర్వ ఘట్టంలో ఆశీనులైన అతిథులు

అపూర్వ ఘట్టంలో ఆశీనులైన అతిథులు

దశాబ్ధాల తరబడి కొనసాగిన వివాదాలకు చెక్‌పడేలా.. హిందువులు వేయి కళ్లతో ఎదురుచూస్తున్న తమ ఆరాధ్య దైవం శ్రీరాముని దేవాలయ నిర్మాణానికి మరికొద్ది నిమిషాల్లో శంకుస్థాపన జరగబోతోంది. రాముడు జన్మించిన అయోధ్యలో ఆ దేవునికి దేవాలయం నిర్మించాలన్న భక్తుల ఆకాంక్ష నెరవేరబోతోంది. ఈ అపూర్వ ఘట్టంలో పాలుపంచుకునేందుకు రాజకీయ, పలు పీఠాల అధిపతులు హారయ్యారు.

దేవాలయ నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్న ప్రధాని నరేంద్ర మోదీ కొద్ది నిమిషాల కిత్రం ప్రత్యేక హెలికాప్టర్‌లో అయోధ్యకు చేరుకున్నారు. ఆయనకు ఉత్తరప్రదేశ్‌ సీఎం యోగీ అధిత్యనాథ్‌ స్వాగతం పలికారు. అంతకు ముందే ఆహ్వానం అందుకున్న వారందరూ అయోధ్యకు చేరుకున్నారు. మధ్యాహ్నం 12:30 నిమిషాలకు ప్రధాని మోదీ రామాలయం నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు. ఈ వేడుకను దేశ ప్రజలు టెలివిజన్‌ ఛానెళ్లలో వీక్షిస్తున్నారు.

హనుమాన్ గర్హి మందిరాన్ని సందర్శించిన తర్వాత ప్రధాని మోడీ భూమిపూజ స్థలానికి రానున్నారు. ప్రధాని పర్యటన సందర్భంగా సరయూ నదీ తీర ప్రాంతంతోపాటు అయోధ్య నగరాన్ని సర్వాంగసుందరంగా అలంకరించారు. హనుమాన్ మందిరాన్ని శానిటైజ్ చేశారు. సరయూ నదీ తీరం సాధువుల భజనలతో మార్మోగుతోంది. ప్రజలు, సాధువులు జైశ్రీరాం అంటూ నినాదాలు చేస్తున్నారు.