ఆంధ్రప్రదేశ్ లో వరద సృష్టించిన భీభత్సంపై ప్రధాని నరేంద్ర మోడి సీఎం జగన్ ను ఫోన్ లో వాకబు చేశారు. వరద కారణంగా దెబ్బతిన్న పంటలకు, రహదారుల అభివృద్ధికి కేంద్రప్రభుత్వం అన్ని విధాలుగా సహయం అందిస్తుందని ప్రధాని ముఖ్యమంత్రి జగన్ కు హామీ ఇచ్చారు. వర్షాల వలన ఇబ్బందులు ఎదుర్కుంటున్న బాధితులు త్వరగా ఈ విపత్తు నుండి కోలుకుని క్షేమంగా ఉండాలని తాను భగవంతుడిని ప్రార్ధిస్తున్నట్లు చెప్పుకొచ్చారు.
ఈ సందర్భంగా సీఏం జగన్ రాష్ట్రంలో వర్ష ప్రభావిత ప్రాంతాల్లో నెలకొన్న పరిస్థితులను ప్రధానికి జగన్ వివరించారు. వాయుగుండం తీరం దాటిందని మళ్ళీ సాధారణ పరిస్థితులని తీసుకును వచ్చేందుకు కృషి చేస్తున్నాం అని పేర్కొంటూ రాష్ట్రంలో అధికార యంత్రాంగం వరద ఉధృతి ఉన్న ప్రాంతాల్లో తీసుకుంటున్న చర్యల గురించి ప్రధానికి వివరించారు.