ఐపీఎల్ 2021 మినీ వేలంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సొంత జిల్లా అయిన కడపకు చెందిన యువ క్రికెటర్ హరిశంకర్ రెడ్డిని చెన్నై సూపర్ కింగ్స్ జట్టు సొంతం చేసుకుంది. ప్రస్తుతం ఆంధ్ర క్రికెట్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న హరిశంకర్ రెడ్డి కొంతకాలంగా నిలకడగా రాణిస్తున్నాడు. పలువురు అంతర్జాతీయ క్రికెటర్లు వేలంలో అమ్ముడుపోకుండా మిగిలిపోగా అదే వేలంలో హరిశంకర్ రెడ్డిని చెన్నై చేజిక్కుంచుకోవడం గమనార్హం. గతంలో కడప జిల్లాకు చెందిన పైడికాల్వ విజయ్ కుమార్ ఐపిఎల్ దక్కన్ ఛార్జర్స్ తరపున ఐపీఎల్ ఆడడం విశేషం..
ప్రతిభకు పట్టాభిషేకం..
22 సంవత్సరాల కుడిచేతి వాటం మీడియం పేస్ బౌలర్ అయిన హరిశంకర్ రెడ్డి స్వస్థలం కడప జిల్లాలోని రాయచోటి. 2018 జనవరి 11వ తేదీన విశాఖపట్నం వేదికగా ఆంధ్రా-కేరళ జట్ల మధ్య జరిగిన టీ20 మ్యాచ్‌తో క్రికెట్‌లోకి హరి శంకర్ రెడ్డి అడుగు పెట్టాడు. ఆడిన తొలి మ్యాచ్ లోనే సత్తా చాటిన హరిశంకర్ రెండు ఓవర్లలో నాలుగు వికెట్లు పడగొట్టి అందరి దృష్టిని ఆకర్షించాడు.గత నెల 15వ తేదీన ముంబైలో పుదుచ్చేరి టీమ్ మీద 35 పరుగులకు మూడు వికెట్లను తీసి ఆకట్టుకున్నాడు. ఇప్పటివరకు 13 టీ20 మ్యాచ్‌లు ఆడిన హరిశంకర్ రెడ్డి దేశవాళీ క్రికెట్ లో నిలకడగా రాణిస్తుండడం కారణంగా ఐపీఎల్ 2021 మినీ ఆక్షన్‌లో పాల్గొనే అవకాశం లభించింది.
20 లక్షల బేస్ ప్రైస్ తో వేలంలోకి వచ్చిన హరిశంకర్ రెడ్డిని అదే ధరకు దిగ్గజ క్రికెటర్లు సభ్యులుగా ఉన్న చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీ సొంతం చేసుకుంది. ఆటగాళ్లలో దాగి ఉన్న ప్రతిభను గుర్తించి ప్రోత్సహించే మహేంద్ర సింగ్ ధోనీ సారధ్యంలో హరిశంకర్ రెడ్డి ప్రతిభ మరింత సాన బడటం ఖాయంగా కనిపిస్తుంది.
తెలుగు క్రికెటర్లు ఐపిఎల్ లో ఆడటం కొత్తేమి కాదు. గతంలో కడప జిల్లాకు చెందిన పైడికాల్వ విజయ్ కుమార్ దక్కన్ ఛార్జర్స్ తరపున సెలెక్ట్ కాగా తూర్పుగోదావరి జిల్లా రాజోలుకు చెందిన బండారు అయ్యప్ప ఢిల్లీ క్యాపిటల్స్ టీంలో చోటు సంపాదించాడు. పైడికాల్వ విజయ్ కుమార్ కి 9 మ్యాచుల్లో ఆడే అవకాశం లభించింది. కాగా 9 మ్యాచుల్లో కేవలం నాలుగు వికెట్లు మాత్రమే సాధించడం ఆటలో తనదైన ముద్ర వేయకపోవడంతో గుర్తింపు రాలేదు. బండారు అయ్యప్ప రిజర్వ్ బెంచ్ కు మాత్రమే పరిమితం కావడంతో ఆడి నిరూపించుకునే అవకాశం రాలేదు. కాగా అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఐపీఎల్ లో హరిశంకర్ రెడ్డి రాణించి టీం ఇండియా క్రికెట్ జట్టులో స్థానం దక్కించుకోవాలని మనమూ కోరుకుందాం..
హైదరాబాద్ రియాల్టీ రంగంలో బాగా వినిపిస్తున్న పేరు హస్తిన. ఇప్పటికే కోంపల్లిలో అగాలియా (Agalia), షాద్ నగర్ లో నేచర్ సిటీ (Nature City) రెసిడెన్షియల్ ప్లాట్స్ ప్రాజెక్ట్ ను విజయవంతంగా నిర్వహిస్తోంది. నేచర్ సిటీలో 5.27 ఎకరాల్లో ప్రీమియం విల్లా ప్లాట్స్ సిద్ధమైయ్యాయి. కస్టమర్ల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇక నేచర్ సిటీ 12 ఎకరాల్లో విస్తరించింది. షాద్ నగర్ అంటే బాగా ఎదుగుతున్న లొకాలిటీ. ఇక్కడున్న రెసిడెన్షియల్ ప్లాట్స్ కు కొన్నేళ్లలోనే మంచి […]