iDreamPost
android-app
ios-app

బీజేపీ ఎంపీకి చెందిన పెట్రోల్ బంకును లూటీ చేసిన దుండగులు

బీజేపీ ఎంపీకి చెందిన పెట్రోల్ బంకును లూటీ చేసిన దుండగులు

కరోనా వైరస్ వ్యాపిస్తున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ విధించిన సంగతి తెలిసిందే. లాక్ డౌన్ కారణంగా ఇళ్లకే పరిమితం కావాల్సి రావడం వల్ల కొన్ని రోజులుగా ఆదాయం లభించే మార్గాలు ప్రజలకు తగ్గిపోయాయి. దీంతో కొందరు దోపిడీలకు పాల్పడుతున్నారు. అలాంటి సంఘటన ఉత్తర ప్రదేశ్ లో జరిగింది.

ఉత్తర ప్రదేశ్ బీజేపీ ఎంపీ ఆర్‌కే సింగ్ పటేల్‌కి చెందిన ఓ పెట్రోల్ బంకులో గుర్తుతెలియని కొందరు దుండగులు దోపిడీకి పాల్పడ్డారు. ఏకంగా బీజేపీ ఎంపీకి చెందిన పెట్రోల్ బంకును దోచుకోవడం చర్చనీయాంశంగ మారింది. పోఖ్రి బర్హాత్ వద్దనున్న బీజేపీ ఎంపీ ఆర్‌కే సింగ్ పటేల్‌కి పెట్రోల్ బంకులో నిన్న సాయంత్రం 7:30 సమయంలో ఈ ఘటన చోటుచేసుకున్నట్టు రాయ్‌పురా పోలీసులు వెల్లడించారు.

ఐదుగురు వ్యక్తులు తమ ద్విచక్రవాహనాల్లో పెట్రోల్ పోయించుకున్న అనంతరం ఆ ఐదుగురు దుండగులు పెట్రోల్ బంకు నుండి 50 వేలు దోచుకుని పరారయ్యారు. దుండగులు వెంట స్థానికులు వెంబడించినప్పటికీ వారు దొరకలేదు. కానీ స్థానికులు వెంబడించినపుడు ఇద్దరు దుండగులు కింద పడిపోయారు, అయినా స్థానికులు వచ్చే లోపులోనే పరారయ్యారు. పెట్రోల్ బంకు మేనేజర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ ఘటనపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి విచారణ చేస్తున్నారు.