iDreamPost
iDreamPost
నాగ చైతన్య-సాయి పల్లవిల ఫస్ట్ టైం కాంబినేషన్ తో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందుతున్న లవ్ స్టోరీ షూటింగ్ చివరి దశలో ఉంది. ఇంకొక్క రెండు వారాలు గట్టిగా కొడితే ఫైనల్ కాపీ పనులకు వెళ్లిపోవచ్చని ఇన్ సైడ్ టాక్. కాకపోతే వర్షాల వల్ల చిన్న బ్రేక్ పడినట్టు ఉంది. అయితే దీని విడుదల ఎప్పుడు ఉంటుందనే ఆసక్తి అక్కినేని అభిమానుల్లో ఎక్కువగా ఉంది. తాజా సమాచారం మేరకు 2021 ప్రేమికుల రోజైన ఫిబ్రవరి 14కి లాక్ చేసే ఆలోచనలో యూనిట్ ఉన్నట్టు ఫ్రెష్ అప్ డేట్. అఫీషియల్ గా ఇంకా చెప్పలేదు. ఇలా ప్లాన్ చేయడానికి కారణాలు ఉన్నాయి. థియేటర్లు ఇంకా తెలుగు రాష్ట్రాల్లో తెరుచుకోలేదు.
ఒకవేళ నవంబర్ లో ఓపెన్ చేసినా పుంజుకునే లోపు డిసెంబర్ వస్తుంది. ఇప్పటికే రెడ్, ఉప్పెన, 30 రోజుల్లో ప్రేమించడం ఎలా, అరణ్య, సోలో బ్రతుకే సో బెటరూ మొదలైనవి సిధ్దంగా ఉన్నాయి. ఇవి షెడ్యూల్ చేయడమే ఆయా నిర్మాతలకు ఓ పెద్ద సవాల్. జనవరికి వెళ్దామా అంటే సంక్రాంతి మీద కెజిఎఫ్ 2, వకీల్ సాబ్ లు కన్నేశాయి. వాటితో పోటీ పడటం ఎంత మాత్రం సేఫ్ కాదు. ఆ తర్వాత అఖిల్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ కూడా అదే నెల మూడో వారం ప్లాన్ చేసుకున్నారు. సో తమ్ముడికే కాంపిటీషన్ ఇవ్వడం న్యాయం కాదు. ఇవన్నీ ఆలోచించి లవ్ స్టోరీని ఫిబ్రవరికి షిఫ్ట్ చేయాలని దాదాపుగా నిర్ణయం తీసుకున్నారని వినికిడి. ఓటిటి ఆఫర్లు ఎంత వస్తున్నా ప్రొడ్యూసర్లు చలించడం లేదు.
స్వతహాగా పెద్ద డిస్ట్రిబ్యూటర్ అయిన నారంగ్ లవ్ స్టోరీ విషయంలో తొందరపడి డిజిటల్ కు ఇచ్చేస్తే థియేటర్ వర్గాల నుంచి విమర్శలు వచ్చే అవకాశం ఉంది. అందుకే అన్ని కోణాల్లో విశ్లేషించే ఇలా ప్లాన్ చేసుకున్నారట. శేఖర్ కమ్ముల రాజీ పడకుండా అవసరమైన సీన్స్ ని మళ్ళీ రీ షూట్ కూడా చేస్తున్నారట. రషెస్ ఎప్పటికప్పుడు చైతు సాయి పల్లవిలకు చూపిస్తూ తగినన్ని మార్పులు చేర్పులు చేస్తున్నట్టుగా తెలిసింది. మజిలీ లాంటి హిట్ తర్వాత నాగ చైతన్య మరో బ్లాక్ బస్టర్ కోసం ఎదురు చూస్తున్నాడు. ఫిదా తర్వాత పెర్ఫార్మన్స్ పరంగా ఆ స్థాయి సినిమా సాయి పల్లవికి తెలుగులో దొరకలేదు. అందుకే తనకు మెగా బ్రేక్ ఇచ్చిన డైరెక్టర్ మీదే అన్ని ఆశలు పెట్టుకుంది. ఇది పూర్తయ్యాక చైతు థాంక్ యు షూట్ కి వెళ్ళిపోతాడు. సాయి పల్లవి బాలన్స్ ఉన్న విరాట పర్వం కోసం రానాతో జాయిన్ అవుతుంది. సో వాలెంటైన్ డేకి లవ్ స్టోరీ వస్తే మంచి స్ట్రాటజీనే అవుతుంది. అదే కరెక్ట్ కూడా