iDreamPost
android-app
ios-app

గాడ్ ఫాదర్ కోసం అరుదైన కలయిక

  • Published Sep 07, 2022 | 5:54 PM Updated Updated Dec 09, 2023 | 12:26 PM

అదే రోజు నాగార్జున ది ఘోస్ట్ కూడా వస్తుండటంతో ఏదైనా మార్పు ఉండే అవకాశం లేకపోలేదు. మలయాళం బ్లాక్ బస్టర్ లూసిఫర్ రీమేక్ గా తీసిన గాడ్ ఫాదర్ టీజర్ ఆ మధ్య అన్ని రకాల స్పందనలు తెచ్చుకుంది.

అదే రోజు నాగార్జున ది ఘోస్ట్ కూడా వస్తుండటంతో ఏదైనా మార్పు ఉండే అవకాశం లేకపోలేదు. మలయాళం బ్లాక్ బస్టర్ లూసిఫర్ రీమేక్ గా తీసిన గాడ్ ఫాదర్ టీజర్ ఆ మధ్య అన్ని రకాల స్పందనలు తెచ్చుకుంది.

గాడ్ ఫాదర్ కోసం అరుదైన కలయిక

మెగాస్టార్ చిరంజీవి హీరోగా మోహన్ రాజా దర్శకత్వంలో రూపొందుతున్న గాడ్ ఫాదర్ వచ్చే నెల 5న దసరా పండగ సందర్భంగా విడుదలవుతున్న సంగతి తెలిసిందే. అదే రోజు నాగార్జున ది ఘోస్ట్ కూడా వస్తుండటంతో ఏదైనా మార్పు ఉండే అవకాశం లేకపోలేదు. మలయాళం బ్లాక్ బస్టర్ లూసిఫర్ రీమేక్ గా తీసిన గాడ్ ఫాదర్ టీజర్ ఆ మధ్య అన్ని రకాల స్పందనలు తెచ్చుకుంది. అయితే రిలీజ్ కు నెల రోజుల కంటే తక్కువ టైం ఉన్నప్పటికీ ప్రమోషన్లు సరైన స్థాయిలో ప్లాన్ చేయడం లేదనే అసంతృప్తి ఫ్యాన్స్ లో పెరిగిపోతోంది సైరా, ఆచార్య విషయంలో కూడా ఇలా నిర్లిప్తంగా ఉండటం వల్లే అవి ఆడాల్సిన స్థాయి కంటే తక్కువయ్యాయని ఫీలయ్యారు .

లేటెస్ట్ అప్ డేట్ మేరకు గాడ్ ఫాదర్ డేట్ లో చేంజ్ ఉన్నా లేకపోయినా ప్రీ రిలీజ్ ఈవెంట్ ని గ్రాండ్ గా ప్లాన్ చేస్తున్నారని తెలిసింది. ఇందుకోసం అరుదైన కలయిక జరగనుంది. చిరంజీవి, ఇందులో ప్రత్యేక పాత్ర పోషించిన సల్మాన్ ఖాన్ లతో పాటు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ని స్పెషల్ గెస్ట్ గా తీసుకొస్తారట. అన్నదమ్ములను ఒకే స్టేజి మీద చాలా రోజులయ్యింది. సైరా వేడుకలో కనిపించిన తర్వాత మళ్ళీ ఈ కాంబో సాధ్యపడలేదు. చిరు పవన్ సల్మాన్ ముగ్గురిని ఒకేసారి చూడటం కన్నా అభిమానులకు కన్నులపండుగ ఇంకేముంటుంది. భద్రత కారణాల దృష్ట్యా ఇది హైదరాబాద్ లోనే చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అధికారిక ప్రకటన వస్తుంది.

సత్యదేవ్ నెగటివ్ షేడ్స్ తో కూడిన పాత్ర పోషించగా నయనతార అతని భార్యగా నటించడం విశేషం. పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో వస్తున్న గాడ్ ఫాదర్ లో ఒరిజినల్ వెర్షన్ తో పోలిస్తే కొన్ని కీలక మార్పులు చేశారు. తమన్ అందించిన సంగీతం కూడా హైలైట్స్ లో ఒకటిగా నిలుస్తుందని అంటున్నారు. రాజకీయ నేపధ్యం కాబట్టి వర్తమాన పరిస్థితులకు అనుగుణంగా ఏవైనా సెటైర్లు ఉండే అవకాశాలు లేకపోలేదు. మెగాస్టార్ అయ్యాక చిరంజీవి కెరీర్ లో మొదటిసారి హీరోయిన్ లేకుండా నటించడం ఇదే మొదటిసారి. స్నేహం కోసం తర్వాత జుట్టు నెరిసిపోయిన క్యారెక్టర్ లో కనిపించడం కూడా దీంతోనే. మరి ఇప్పటికైనా గాడ్ ఫాదర్ స్పీడ్ పెంచుతాడో లేదో చూడాలి

Jojobet GirişMadridbetMariobetcasibommatbet girişgrandpashabetcasino siteleriDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabet destekgrandpashabet girişGrandpashabetCasibomCasibomCasibomjojobet girişcasibomgrandpashabetesrar satın algrandpashabetholiganbetjojobetjojobet girişjojobetjojobet giriş