iDreamPost
iDreamPost
రేణు దేశాయ్ తో చట్టప్రకారంగా విడాకులు తీసుకున్నప్పటికీ పవన్ కళ్యాణ్ వారసుడిగా అభిమానుల చూపు అకీరా నందన్ మీదే ఉంది. వ్యక్తిగత వైవాహిక జీవితాలకు, పిల్లల డెబ్యులకు పరిశ్రమలో ముందు నుంచి లింక్ పెట్టడం లేదు. సీనియర్ నరేష్, నాగ చైతన్య లాంటి వాళ్ళు ఈ కారణంగానే మంచి కెరీర్ ని నిర్మించుకున్నారు. ఇక అసలు విషయానికి వస్తే అకీరా నందన్ సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ త్వరలోనే ఉండొచ్చని ఫిలిం నగర్ టాక్. గత కొంత కాలంగా అకీరా హైదరాబాద్ వచ్చినప్పుడంతా ఎక్కువ సమయం అడవి శేష్ తో గడుపుతున్నాడు. నటనకు సంబంధించిన మెలకువలు నేర్పమని పవన్ ప్రత్యేకంగా కోరడం వల్లే శేష్ సరే అన్నట్టుగా సమాచారం.
అయితే మేజర్ లోనే అకీరా నందన్ ఓ కీలకమైన క్యామియో చేశాడనే ప్రచారం కూడా ఉంది. అది ఎంతవరకు నిజమన్నది కూడా ఇంకా తెలియాల్సి ఉంది. ఇటీవలే శేష్, అకీరా మాస్కులు వేసుకుని తీసుకున్న పిక్ ఒకటి సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యింది. దీన్ని కూడా అభిమానులు ఒక సాక్ష్యంగా భావిస్తున్నారు. రేణు దేశాయ్ అకీరాను తెరకు పరిచయం చేయాలన్న సంకల్పంతోనే ఉంది. తెలుగులో పవన్ ఫ్యాన్స్ అండదండలు ఉంటాయి కాబట్టి ఇక్కడ సెటిల్ కావడం ఈజీ. ఫుల్ లెంత్ హీరోగా అంటే తొందరపడినట్టు అవుతుంది కాబట్టి ముందు చిన్న పాత్రలతో ట్రై చేసే ఆలోచన జరుగుతున్నట్టు కనిపిస్తోంది.
ఇప్పటికే మెగా ఫ్యామిలీ నుంచి బోలెడు హీరోలు ఉన్నారు. చిరంజీవి, నాగబాబు తరఫున చెరొకరు ఆల్రెడీ ఇండస్ట్రీలో సెట్ అయిపోయారు. ఇక మిగిలింది పవన్ కళ్యాణ్ నుంచే. మూడో భార్య అన్నా లెజ్నెవాకు కలిగిన మగ సంతానం ఇంకా స్కూల్ కు వెళ్లే వయసు కాబట్టి ఈ తరం పవర్ అభిమానులు చూసుకునే ఏకైక ఆప్షన్ అకీరా ఒక్కడే. సో రావాలే కానీ స్వాగతం చెప్పేందుకు అభిమానులు సిద్ధంగా ఉన్నారు. ఈ లెక్కన మెగా ఫ్యామిలీ నుంచి ఉన్న రాబోతున్న హీరోల కౌంట్ కు ఇప్పట్లో బ్రేక్ పడేలా లేదు. ఇంత మంది హీరోలు ఉన్న కుటుంబం కూడా బహుశా చిరంజీవిది ఒక్కటేనేమో.