iDreamPost
android-app
ios-app

Pawan Kalyan & SDT : పవర్ ఫుల్ కాంబినేషన్ బాగుంది కానీ

  • Published Feb 04, 2022 | 5:05 AM Updated Updated Feb 04, 2022 | 5:05 AM
Pawan Kalyan & SDT :  పవర్ ఫుల్ కాంబినేషన్ బాగుంది కానీ

గత ఏడాది తమిళంలో విడుదలై మంచి స్పందన దక్కించుకున్న వినోదయ సితం తెలుగు రీమేక్ కు రంగం సిద్ధమయ్యింది. ఎవరో చేస్తే ఇదేమి పెద్ద న్యూస్ కాదు కానీ పవన్ కళ్యాణ్ సాయి తేజ్ కాంబినేషన్ అనగానే ఎక్కడ లేని అంచనాలు పెరిగిపోతాయి. ఇది చాలా తక్కువ బడ్జెట్ తో రూపొందే సినిమా. అయినా కూడా మూడు నిర్మాణ సంస్థలు ఇందులో భాగస్వామ్యం పంచుకోబోతున్నాయని ఇన్ సైడ్ టాక్. పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ కలిసి ప్రొడ్యూస్ చేయబోతున్నట్టు తెలిసింది. పవన్ సాయి తేజ్ ల రెమ్యునరేషన్లు మినహాయిస్తే చాలా రీజనబుల్ బడ్జెట్ లో అయిపోతుంది.

కాకపోతే గతంలో చెప్పుకున్నట్టు వినోదయ సితం ఒరిజినల్ వెర్షన్ లో లీడ్ రోల్స్ చేసింది స్టార్లు కాదు. ఇద్దరు క్యారెక్టర్ ఆర్టిస్టులు. దర్శకుడు సముతిర ఖని నటించడంతో పాటు దర్శకత్వ బాధ్యతలు చక్కగా నిర్వర్తించారు. తెలుగులోనూ ఆయనకే ఇస్తారట. మరి అక్కడ హీరోలు చేయనిది ఇక్కడ పవన్ లాంటి పవర్ ఫుల్ ఇమేజ్ ఉన్న స్టార్ చేస్తే ఎలా ఉంటుందో వేరే చెప్పాలా. అయితే త్రివిక్రమ్ వెనుక ఉన్నాడు కాబట్టి చాలా మార్పులు చేర్పులు జరుగుతాయి. విధి రాతలో చావును రాసి పెట్టున్న ఓ సగటు ఉద్యోగి దగ్గరకు అదే విధి మనిషి రూపంలో వస్తే ఎలా ఉంటుందన్న పాయింట్ తో వినోదయ సితం రూపొందింది. పవన్ రోల్ విధిదే అయ్యుండొచ్చు.

కేవలం నలభై ఐదు రోజుల్లో షూటింగ్ పూర్తి చేస్తారట. హరిహర వీరమల్లుకి వచ్చే గ్యాప్ లో త్వరగా ఫినిష్ చేసేలా ప్లానింగ్ జరుగుతున్నట్టు వినికిడి. హరీష్ శంకర్ తీయబోయే భవదీయుడు భగత్ సింగ్ కూడా టైం డిమాండ్ చేసేదే కాబట్టి ఆ లోగా రెండు సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉంచుకుంటే ఫ్లోకి ఇబ్బంది ఉండదు. వకీల్ సాబ్, భీమ్లా నాయక్ ఇప్పుడీ వినోదయ సితం చూస్తుంటే రీమేకులతో పవన్ సేఫ్ గేమ్ కే ప్రాధాన్యం ఇస్తున్నట్టు కనిపిస్తోంది. అఫీషియల్ ప్రకటన ఇంకా రాలేదు కానీ ఈలోగా అభిమానులు ఈ వినోదయ సితంను ఓటిటిలో చూసేందుకు రెడీ అవుతున్నారు. లీక్స్ తాలూకు ప్రభావం ఇది

Also Read : Ante Sundaraniki : ఏడు రిలీజ్ డేట్లను అందుకే బ్లాక్ చేశారు