iDreamPost
android-app
ios-app

పవన్ కళ్యాణ్ చేతుల మీదగా

  • Published May 11, 2018 | 7:23 AM Updated Updated May 11, 2018 | 7:23 AM
పవన్ కళ్యాణ్ చేతుల మీదగా

మాస్ మహారాజ్ రవితేజ, మాళవిక శర్మ జంటగా.. రామ్‌ తాళ్ళూరి నిర్మించిన సినిమా “నేల టిక్కెట్టు”. ఫిదా చిత్రంతో ఆకట్టుకున్న శక్తికాంత్‌ కార్తీక్‌ ఈ చిత్రానికి స్వరకర్త. ఈ సినిమా ఆడియో రిలీజ్‌ వేడుకలో ముఖ్య అతిథిగా పవర్ స్టార్ పవన్‌ కల్యాణ్‌ పాల్గొన్నారు. ఈ సందర్బంగా పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ మాట్లాడుతూ… “రవితేజ మాస్‌ మహారాజాగా మీకందరికీ తెలియకముందే నాకు బాగా తెలుసు. నా కంటే ముందే ఆయన నటుడయ్యారు. ఆయన నటనంటే నాకు చాలా ఇష్టం. ఎన్నో కష్టాలను ఎదుర్కొన్న వారే ఆయనలా నవ్వగలుగుతారు. నవ్వించగలుగుతారు. రవితేజలో నాకు నచ్చే విషయం. ఆయన ఎంత మందిలో ఉన్నా, ఏ పాత్రలో అయినా నటిస్తారు. సిగ్గు, బిడియం లేకుండా ఆయనలా నటించడం చాలా కష్టం” అని అన్నారు. “నేల టికెట్టు” ఘన విజయం సాధించాలని పవన్‌ ఆకాంక్షించారు.‘‘పదేళ్ల క్రితం పవన్‌ కల్యాణ్‌గారితో ఫోన్‌లో మాట్లాడాను. “మీరు అంత సిగ్గు లేకుండా ఎలా చేస్తారండీ’ అని ఆయన అన్నారు. వన్నాఫ్‌ ది బెస్ట్‌ కాంప్లిమెంట్స్‌ అది. ఎప్పటికీ మర్చిపోలేను., హ్యాపీ బర్త్‌డే సత్యనారాయణ గారు (కల్యాణ్‌కృష్ణ తండ్రి). మీ కొడుకు హ్యాట్రిక్‌ సాధింబోతున్నాడు. శక్తికాంత్‌ మంచి సంగీతం ఇచ్చాడు. రామ్‌గారు ప్యాషనేట్‌ నిర్మాత’’ అని రవితేజ అన్నారు. కాగా ఈ వేడుకలో చిత్రబృందం పవన్ పై చేసిన ప్రత్యేక విడియో అందరిని ఆకట్టుకుంది. ఈ చిత్రం ఈ నెల 24న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.