iDreamPost
android-app
ios-app

జనసేనాని కమల దళ సైనికుడు కాబోతున్నాడా ?

  • Published Dec 04, 2019 | 6:46 AM Updated Updated Dec 04, 2019 | 6:46 AM
జనసేనాని కమల దళ సైనికుడు కాబోతున్నాడా ?

నిన్న పవన్ కళ్యాణ్ రాయల సీమ పర్యటనలో భాగంగా కడప , రాజంపేట జనసేన ప్రతినిధులతోనూ , లాయర్లతోనూ విడివిడిగా సమావేశమయ్యారు . ఈ సందర్భంగా వారు ప్రస్తావించిన అంశాల పరిశీలన ,

1 .ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ పార్టీలో ఉంటే నాకు మంచిదనిపిస్తుంది .నేను మోడీ దగ్గరికెళ్లి హోదా విషయంలో మీమనసు నొప్పించాను అని రాజీ పడితే వైసీపీ వాళ్ళు రాజకీయం చెయ్యగలుగుతారా?మళ్లీ తెలుగు దేశంతో కలిసి పని చేద్దామంటే పాపం వాళ్ళని 2018 లో తిట్టా కదా?ఏమిబాగుంటుంది . అది కూడా గట్టిగా తిట్టలేదు.

ఇటీవలి కాలంలో పవన్ ఢిల్లీ పర్యటనలో గోప్యతని పాటించడం , ఆ పర్యటన తర్వాత ప్రధానంగా కుల , మతాల్ని ఆధారంగా చేస్కొని వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం ఇప్పుడీ “”మోడీతో రాజీ పడితే” వ్యాఖ్యలు కలిపి చూస్తే త్వరలో పవన్ జనసేనని బీజేపీలో విలీనం చేస్తాడా?అని ప్రజలకు అనుమానం వస్తుంది.రాజకీయ విశ్లేషకుల మాట కూడా ఇదే సూచిస్తుంది . అయితే దానితో పాటు తెలుగుదేశం పై సానుభూతి , అనుకూల వ్యాఖ్యలు చూస్తే సమీప భవిష్యత్ లో బీజేపీ ,టీడీపీ కూడా మళ్ళీ కలిసి పని చేయవచ్చని, టీడీపీని విమర్శించిన తాను బీజేపీ తరపున టీడీపీ తో కలిసి పని చేస్తే అభిమానులు ఎలాస్పందిస్తారోనన్న అనుమానం అంతర్లీనంగా పవన్ ని వేధిస్తున్నట్టు ఉంది .

Also Read :కై(వి)లాస దీవిలో నిత్యానంద
2 . ప్రకృతి ఎదో రూపంలో బయటికి వచ్చి సుర సంహరం చేసేస్తుంది.”ఎక్కి తొక్కి ఊడిగం చేస్తే” మేం పడతామను కొంటున్నావా ? మేం జనసేన రాయలసీమ కాదిది సింహాల సీమ .

ఇటీవలి కాలంలో తెలుగు నుడిని అందిపుచ్చుకొన్న పవన్ ముందు కొంతైనా తెలుగు నేర్చుకొంటే మంచిదనిపిస్తుంది . కనీసం పెద్ద బాల శిక్ష అయినా .ప్రకృతి ఎదో రూపంలో బయటికి వచ్చి అసుర సంహారం చేస్తుందేమో కానీ సుర సంహారం కాదు,ఎవరైనా ఎక్కి తొక్కి దాష్టీకం చెలాయిస్తారు కానీ ఊడిగం చేయటానికి ఎక్కి ఎందుకు తొక్కుతారో ఏమి తొక్కుతారో పవన్ కే తెలియాలి .

నిన్నా మొన్నటి వరకూ రాయలసీమని,కడప జిల్లాని పలు విధానాలుగా తూలనాడిన పవన్ కు హఠాత్తుగా సీమ మీద ప్రేమ పుట్టుకురావటం,సీమ జ్ఞాన ఖని , సీమ చదువుల సరస్వతి , సింహాల సీమ అని సినీ ఫక్కీలో డైలాగులు చెప్పటం చూస్తుంటే వెనక అంతర్లీనంగా ఎదో ప్రత్యేక అజెండా ఉందని అనుమానం కలగకమానదు .

3 . జగన్ మతం మార్చుకొంటే కులం ఉండకూడదు . ఐతే మతం అయినా ఉండాలి , లేకపోతే కులం అయినా ఉండాలి . రెండూ ఉంచుకొంటానంటే కుదరదు . మాట తప్పకపోవడం నా కులం అంటే మిగతా కులాలు మాట తప్పుతాయా ? ఎమ్మాట్లాడుతున్నాడండీ జగన్ రెడ్డి .

పవన్ జ్ఞాన ఖడ్గానికి కొండరాయితో సాన పెట్టకలసిన అవసరం కనపడుతుంది . నా మతం మానవత్వం అంటే మానవత్వాన్నే నా మతంగా ఆచరిస్తున్నాను అనే కానీ నా మతంలోనే మానవత్వం ఉంది ఇంకెక్కడా లేదు అని కాదండీ . మాట తప్పకపోవడమే నా కులం అంటే ప్రత్యేకించి నా ఒక్కడి కులమే మాట తప్పదు,మిగతా కులాలు తప్పుతాయి అని కాదు సార్ .

పవన్ వక్రీకరణలు చూస్తుంటే ఆంధ్రజ్యోతిఉద్యోగులు ఎవరైనా ప్రసంగాలు రాస్తున్నారా?అనిపిస్తుంది.

Also Read :సుజ‌నా చౌద‌రి చేత‌ల్లోకి టీవీ చానెల్
ఏదేమైనా పవన్ కళ్యాణ్ గురించి అతని అభిమానులు,ప్రజలు మరింతగా తెలుసుకొనేందుకు అతని రాయలసీమ పర్యటన దోహదం చేస్తోందని చెప్పొచ్చు . దాని పర్యావసానమే జన సేన వీరాభిమానులు కూడా పవన్ కుల,మత వ్యాఖ్యల పట్ల మొదటి సారిగా అసహనం వ్యక్తం చేయడం , అదే సమయంలో జగన్ మానవత మతం వ్యాఖ్యల పట్ల సానుకూలత కనపరచడం చూస్తే సేనానిని సేన సరిగ్గానే అర్థం చేసుకొంటున్నట్లు ఉంది .