iDreamPost
android-app
ios-app

తిరుపతిలో మతం, కులం పై పవన్ షాకింగ్ కామెంట్స్

తిరుపతిలో మతం, కులం పై పవన్ షాకింగ్ కామెంట్స్

సినీ నటుడు, జనసేన అధినేత పవన కళ్యాణ్ తిరుపతిలో కులం, మతం, ధర్మం పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తిరుపతి, చిత్తూరు పార్లమెంట్ నియోజకవర్గాల పార్టీ సమీక్షా సమావేశం సోమవారం జరిగింది. ఈ సమావేశంలో పవన్ కళ్యాణ్ సీఎం జగన్ పై, హిందువుల పై తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. వివరాలు ఆయన మాటల్లోనే.. ” గల్ఫ్ దేశాలకు ఉపాధి కోసం వెళ్లిన వారిలో ముస్లింలు మన దేశం గొప్పదని చెబుతారు కానీ హిందువులు చెప్పరు. హిందూ ధర్మం అంత గొప్పది కాబట్టి ఇలా ఉంది. కానీ కొంత మంది దీనిపై ఆట ఆడుతున్నారు. అందులో రాజకీయ నాయకులు ఉన్నారు. వారిలో ఎక్కువ మంది హిందువులే.

గొడవలు పెట్టేది హిందూ నాయకులే. గొడవలు పెట్టి రాజకీయ చేస్తున్నారు. తిరుమలలో హిందూ ధర్మం రక్షించాలంటే ఏమి చేయాలి..? స్థానిక ఎమ్మెల్యే లేదా అధికారులు ధర్మ రక్షణ పై చెబితే సరిపోతుంది. కానీ ఏమి చేస్తున్నారు.? మీరే గొడవలు పెడుతున్నారు. మీకు గొడవలు కావాలి. హిందువులు, హిందూ రాజకీయ నాయకుల ప్రోద్భలం లేకుండా తిరుమలలో ఆలా జరగదు. హిందూ నాయకులు అంటే బిజెపి నాయకులు కాదు. వేరే పార్టీ నాయకులు. అందులో వైసిపి నాయకులు ఉండొచ్చు. ఇతర పార్టీ నాయకులు ఉండొచ్చు. కానీ నాకు తెలియదు.

నేను చిన్నప్పటి నుంచి వింటున్నది ఏమిటంటే.. సెక్యులరిజం ను బాగా ఇబ్బంది పెట్టింది హిందువులే. ఇలా నేను మాట్లాడడం వల్ల కొంత మందికి ఇబ్బంది ఉండొచ్చు. రేపు నన్ను వాళ్లు ఏమైనా అనొచ్చు. కానీ సత్యాన్ని గురించి మాట్లాడేందుకు నేను వెనుకాడను. సమాజంలో ఒక సమస్యను పరిష్కరించాలంటే దాని పై డిబేట్ జరగాలి. ఈ రోజు నేను మాట్లాడుతున్న మాటలకు రేపు ఎవరైనా నన్ను తిడితే, నేను సమాధానం చెబుతా. అన్నిటికి సమాధానం చెబుతా.

అందరిని కూర్చోపెట్టి.. వీళ్ళను కౌగిలించుకుంటే నాకు దళితుల ఓట్లు పడతాయి. వీళ్ళను కౌగిలించుకుంటే నాకు హిందువుల ఓట్లు పడతాయి. వీళ్ళను కౌగిలించుకుంటే నాకు రెడ్ల ఓట్లు పడతాయి. వీళ్ళను కౌగిలించుకుంటే నాకు బలిజల ఓట్లు పడతాయి. వీళ్ళను కౌగిలించుకుంటే నాకు యాదవుల ఓట్లు పడతాయన్న ఆలోచన నాకు లేదు. నాకు అవసరం లేదు. సమాజం లో అన్ని మతాలను, కులాలను సమానంగా చూడాలి. ఏవైనా తప్పొప్పులు ఉంటె సరి చేసుకోవాలి. ధర్మాన్ని పరిరక్షించుకోవాలి.

ఏడు కొండల వాడి సన్నిధిలో చెబుతున్నా నేను ధర్మానికి నిలబడే వ్యక్తిని. ధర్మాన్ని రక్షించడమంటే.. ఎదుట వారి మతాన్ని నరికేసిది అనే ఆలోచన విధానాన్ని చాలా మంది ప్రజలను ప్రేరేపిస్తున్నారు. తన ధర్మం కానప్పటికీ ఎదుటి వారి ధర్మాన్ని కాపాడేదే నేను మాట్లాడే ధర్మం.

ఇందాక నేను వస్తుంటే.. మీడియా వాళ్ళు జగన్ రెడ్డి గారు నా మతం ఇది, నా కులం ఇది అని మాట్లాడుతున్నారని నాకు చూపించారు. నిజానికి మతం మార్చుకుంటే ఇక అక్కడ కులం రాదు. కులం రాకూడదు అంతే. రెడ్డి, కమ్మ, బలిజ, యాదవ ఈ కులాలన్నీ హిందూ ధర్మం నుంచి వచ్చాయి. క్రిస్టియానిటీ కి వెళితే కులం రాదు. కానీ మన దౌర్భాగ్యం ఏమిటంటే.. మతం మారినా కులాలు మారవు. అంటే అక్కడ కులాలను కూడా వాడుకోవాలి.

అయన (జగన్) అన్నదేమిటంటే.. నా మతాచారం మానవత్వం అన్నారు. చిన్నప్పుడు నేను మిషనరీ స్కూల్ లో చదువుకున్నాను. తనను తానూ తగ్గించుకున్నవాడు హెచ్చయింపబడును. హెచ్చయింపబడినవాడు తగ్గించబడును అని జీసస్ చెప్పారు. ఇతరులు తప్పుకు తనకు శిలువ వేయండని జీసస్ కోరుకున్నాడు. జీసస్ కుఅంత సహనం. కానీ జగన్ రెడ్డి గారికి చెట్టు మీద కూడా సహనం లేదు. అలాంటి జగన్ మనిషి మీద సహనం ఎక్కడ చూపిస్తారు..? క్రిస్టినీయానిటీ పైన నిజమైన విశ్వాసం ఉంటే మొక్కకు కూడా హాని చేయరు.

నా కులం మాట తప్పని కులం అన్నారు. అసలు మతం మారిన తర్వాత జగన్ రెడ్డి గారికి కులం ఎక్కడ నుంచి వచ్చింది. మతం మారిన తర్వాత కులం ఎందుకు రావాలి మీకు. కులం వదిలేయాలి. మా నాన్న నాకు కులం పేరు పెట్టలేదు. నాగబాబు, పవన్ కళ్యాణ్ బాబు అంటాం. నా అసలు పేరు కళ్యాణ్ కుమార్, నాయుడు లేదు. నాయుడు అని వైసిపి వాళ్ళు నాకు పేరు పెట్టారు. అలా అని నేను ఇతర కులాల వారి గురించి మాట్లాడడం లేదు. రాజ్యాంగ ఇంత బలంగా చెప్పినప్పుడు అసలు కులం సమస్య ఎక్కడ ఉంది.

నా మత విశ్వాసం ఇది, నా కులం ఇది అని జగన్ రెడ్డి గారు ఇప్పుడు మాట్లాడతారు. నా కులం మాట తప్పని కులం అంటున్నారు. జగన్ రెడ్డి గారిని ఒకటి అడుగుతున్నా.. ఒకసారి మతం మారాక కులం ఎక్కడ ఉంటుంది. కులం వదిలేయండి. కులం కావాలి, మతం కావాలి, ఓట్లు కావాలి, డబ్బు కావాలి, అన్నీ కావాలి. ఇక కుదరవు. సమాజం మారింది. యువత మారింది. తరాలు మారినవి. కానీ రంగులే మారడంలేదు. రాష్ట్రంలో అన్నిటికి రంగులు మార్చుతున్నారు. ఇక ఏడు కొండలే మిగిలాయి. అవి వైసిపి రంగులు” అని పవన్ కళ్యాణ్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.