పవన్ కల్యాణ్ సభలో పాల్గొనాల్సిన అవసరం ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణకు లేదని ఏపీ బీజేపీ ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్‌రెడ్డి అన్నారు. ఇసుక సమస్యను పరిష్కరించాలని ముఖ్యమంత్రి జగన్‌కు లేఖ రాసింది మొదట బీజేపీయేనని తెలిపారు. ఇసుక సమస్యపై గవర్నర్‌ని కలిసి రిప్రజెంటేషన్ ఇచ్చింది కూడా బీజేపీయేనని వెల్లడించారు. సమస్యకి సంఘీభావం తెలుపుతున్నామే తప్ప వేరే పార్టీలకు కాదని స్పష్టం చేశారు. పవన్‌తో వేదికను పంచుకోమని విష్ణువర్ధన్‌రెడ్డి చెప్పారు. నవంబర్ 4న విజయవాడలో బీజేపీ పెద్దఎత్తున మరోసారి ఆందోళన చేపడుతుందని తెలిపారు.