iDreamPost
iDreamPost
మదనపల్లి సభలో తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి అయినా మరో రెడ్ది అయినా తలలు నరుకుతాం అన్న రాప్తాడు జనసేన నాయకుడి సాకే పవన్ కుమార్ వాఖ్యల మీద దుమారం చెలరేగింది.
ఆ నాయకుడు ఎదో ఆవేశంలో అన్నాడు,ఆమాటలు ఎవరు సీరియస్ గా తీసుకోవద్దని పవన్ చెప్తారని అందరు అనుకోగా పవన్ దానికి భిన్నంగా స్పందించాడు.‘‘ఎన్ని ఇబ్బందులు పెట్టి ఉంటే సాకే పవన్ అలా మాట్లాడి ఉంటాడు?! తలలు నరుకుతాం అన్నందుకు కేసులు ఆయనపై కాదు.. నాపై పెట్టండి.” అని పవన్ అన్నాడు. తలలు తీస్తామన్నందుకే మీరు అంత బాధపడుతుంటే.. జగన్ .. మాజీ సీఎం చంద్రబాబును ఉరితీయాలని అన్నందుకు ఏ కేసు పెట్టాలి? అని ఎదురు ప్రశ్నించాడు.
Also Read : పవన్ ఆదేశిస్తే తలలు నరుకుతా…
పవన్ నుంచి సరైన స్పందన రాకపోగా,ఎదురు ప్రశ్నలు రావాటంతో వైసీపీ నేతలు సేక్ పవన కుమార్ “తలలు నరుకుతాం” హెచ్చరికను సీరియ్సగా తీసుకున్నారు. తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి జిల్లాల SP ని కలిసి ఫిర్యాదు చేశాడు.ఇలాంటి వాఖ్యలతో ఫ్యాక్షన్ కు మళ్లి ఆజ్యం పోస్తున్నారని ప్రకాశ్ రెడ్డి వాఖ్యానించాడు.