iDreamPost
android-app
ios-app

BoycottPathaan బాయ్‌కాట్‌ లాల్ సింగ్ చద్దా అయిపోయింది, ఇప్పుడు షారుఖ్ ఖాన్ మూవీ ప‌ఠాన్ మీద ప‌డ్డారు

  • Published Aug 13, 2022 | 7:01 PM Updated Updated Aug 13, 2022 | 7:01 PM
  • Published Aug 13, 2022 | 7:01 PMUpdated Aug 13, 2022 | 7:01 PM
BoycottPathaan బాయ్‌కాట్‌ లాల్ సింగ్ చద్దా అయిపోయింది, ఇప్పుడు షారుఖ్ ఖాన్ మూవీ ప‌ఠాన్ మీద ప‌డ్డారు

అమీర్ ఖాన్ లాల్ సింగ్ చద్దా తర్వాత, నెటిజన్లు ఇప్పుడు షారుఖ్ ఖాన్ నటించిన పఠాన్‌ను టార్గెట్ చేస్తున్నారు. #BoycottPathaan సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉంది. ఇప్పుడు పాఠాన్ నిర్మాత‌ల్లో టెన్ష‌న్ మొద‌లైంది.

అమీర్ ఖాన్ నటించిన లాల్ సింగ్ చద్దా ట్రైలర్ విడుదలైనప్పటి నుండి #BoycottLaalSinghChaddha ట్రెండింగ్‌లో ఉంది. దీనికి చాలా కార‌ణాలు. అప్పుడెప్పుడో దేశంలో అస‌హ‌నం ఉంద‌న్న కామెంట్ ను కొంద‌రు చెబుతుంటే పీకె సినిమాతో హిందువుల‌ను వెట‌క‌రించాడ‌ని మరికొంద‌రు ట్వీట్లు చేస్తున్నారు. మొత్తం మీద వాళ్ల‌వాళ్ల రీజ‌న్స్ తో, నెటిజన్లు అమీర్, కరీనా కపూర్‌లపై విరుచుకుపడ్డారు. బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రానికి పాజిటీవ్ రెస్పాన్స్ పెద్ద‌గా లేదు కాబ‌ట్టి, ట్రోలింగ్ డోస్ మ‌రింత‌గా పెరిగింది. ఇప్పుడునెటిజన్లు షారుఖ్ ఖాన్ నటించిన పఠాన్‌ను టార్గెట్ చేస్తున్నారు.

#BoycottPathaan సోషల్ మీడియాలో ట్రెండింగ్ మొద‌లైంది. అలాగ‌ని ఇదేమీ ఈనెల‌లో వ‌చ్చే సినిమా కాదు. పఠాన్ షారుఖ్ ఖాన్, దీపికా పదుకొనే, జాన్ అబ్రహం న‌టించిన ప‌ఠాన్ 25 జనవరి 2023న విడుదల కానుంది. అయితేనేం ఇప్పుడే #BoycottPathaan ఎందుకు ట్రెండింగ్‌లో ఉంది?

కొద్ది రోజుల క్రితం షారుఖ్ ఖాన్ తన పిల్లలతో కలిసి విమానాశ్రయంలో కనిపించాడు. సెల్ఫీని క్లిక్ చేయడానికి ప్రయత్నిస్తున్నప్పుడు ఒక అభిమాని, SRK చేతిని పట్టుకున్నాడు. ఇది ఫారూఖ్ కు న‌చ్చ‌లేదు. కింగ్ ఖాన్ అభిమాని పట్ల అసభ్యంగా ప్రవర్తించాడ‌ని నెటిజన్లు భావిస్తున్నారు. నిజానికి ఇదేమంత ఇష్యూకాదు. కాని బాయ్‌కాట్‌ చేయాల‌నుకున్న‌ప్పుడు చిన్న‌వాటిని పెద్ద‌గా మార్చుతారుక‌దా? ఇప్పుడు జ‌రుగుతోందికూడా అదే.

జనవరి 2020లో, ఢిల్లీలో తన చిత్రం ఛపాక్‌ను ప్రమోట్ చేస్తున్నప్పుడు, దీపిక JNUకెళ్లింది. అక్క‌డ నిర‌స‌న చేస్తున్న విద్యార్థులకు సంఘీభావం తెలిపారు. ఇది బీజేపీ అనుకూల వాదుల‌కు అస్స‌లు న‌చ్చ‌లేదు. ఆ సమయంలో సోషల్ మీడియాలో #BoycottChhapaak ట్రెండ్ చేశారు. ఇప్పుడు, నెటిజన్లు మళ్లీ దీపిక సినిమా పఠాన్‌ను టార్గెట్ చేస్తున్నారు.

షారూఖ్ ఖాన్ చేతిలో యోగి దేవనాథ్ తలను చూపిస్తూ, పఠాన్‌పై మార్ఫ్ చేసిన పోస్టర్‌ను షారూక్ అభిమాని ఒక‌డు ట్వీట్ చేశాడు. అత‌నెవ‌రో చేసిన ఈ దిక్కుమాలిన ప‌నికి, ఈ మార్ఫింగ్ పోస్టర్ పై నెటిజన్లు భగ్గుమంటున్నారు. షారూఖ్ సినిమాను బాయ్‌కాట్ చేస్తున్నారు.

Jojobet GirişjojobetJojobetJojobetjojobetjojobetJojobetZirvebetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişjojobet giriş