iDreamPost
iDreamPost
మన ఇళ్లల్లో పెంపుడు జంతువులని పెంచుకుంటాం. కొంతమంది పక్షులని కూడా పెంచుకుంటారు. ముఖ్యంగా రామచిలకలని పెంచుకుంటారు. చాలా మంది మాట్లాడే రామచిలకలని పెంచుకుంటారు. వాటికి చిన్ని చిన్ని మాటలని నేర్పించి అవి మాట్లాడుతుంటే సంతోషిస్తారు. ఉత్తరప్రదేశ్ గయాలోని శ్యామ్ దేవ్ ప్రసాద్ గుప్తా, సంగీత గుప్తా అనే దంపతులు గత 12 ఏళ్లుగా ఓ చిలకని పెంచుకుంటున్నారు. అయితే ఇటీవల ఆ చిలక కనిపించకుండా పోయిందట.
అపురూపంగా పెంచుకున్న ఆ చిలుకతో వారికి చాలా మంచి అనుబంధం ఉంది. కొన్ని రోజులుగా ఆ చిలుక కనబడకపోవడంతో వారు తెగ బాధపడిపోతూ చుట్టుపక్కల అంతా వెతికేస్తున్నారు. ఆ ఊరితో పాటు, చుట్టుపక్కల ఊర్లలో కూడా వెతికేస్తున్నారు. అక్కడ దగ్గర్లో ఉండే చెట్ల దగ్గరికివెళ్ళి రోజూ ఆ చిలకతో మాట్లాడే మాటలు కూడా మాట్లాడి చూస్తున్నారు తమ చిలక వస్తుందేమో అని, అయినా అది దొరకట్లేదని బాధపడుతున్నారు.
తాజాగా తమ చిలుక కనిపించడం లేదని గయాతో పాటు చుట్టు పక్కల ప్రాంతాల్లో కూడా పోస్టర్లను అతికించారు. తమ చిలకని ఎవరైనా పట్టిస్తే 5100 రూపాయలు కూడా ఇస్తామని ప్రకటించారు. పోస్టర్లు మాత్రమే కాక తమ చిలుక తప్పిపోయిందని సోషల్ మీడియాలో కూడా ప్రచారం చేస్తున్నారు ఈ దంపతులు. ఆ చిలక కోసం తెగ హైరానా పడిపోతున్నారు ఈ జంట. తొందరగా ఆ చిలక వీరికి దొరకాలి అని కోరుకుందాం.