ఇప్పటికే చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో వైసీపీ జెండా నిలబెట్టిన స్పూర్తితో మరో కీలక అడుగు పడుతోంది. తెదేపా అధినేత స్వగ్రామం నారావారిపల్లెలో సైతం వైసీపీ గెలిచి ఆయనకు నిద్ర లేకుండా చేసేందుకు చిత్తూరు వైయస్ఆర్ సీపీ నాయకులు గెలుపు కోసం ప్రయత్నాలు మొదలు పెట్టారు.
నాలుగో దశలో ఎన్నికలు
నారావారిపల్లె చంద్రబాబు పుట్టిన ఊరు. ఇది చంద్రగిరి నియోజకవర్గంలోని కందుల వారి పల్లె పంచాయతీ లో ఉంది. ఇక్కడ జనాభా1328. వీరిలో పురుషులు 670 మంది అయితే, మహిళా జనాభా 659. మొత్తం 330 కుటుంబాలు ఇక్కడ నివసిస్తుంటాయి. వ్యవసాయాధారిత గ్రామం. మొత్తం ఆరు వార్డులు ఉన్నాయి. అలాగే గ్రామం మొత్తం మీద రెండు వందల హెక్టార్ల భూమి ఉన్న రైతులు ఉన్నారు. నియోజకవర్గ ముఖ్య కేంద్రం చంద్రగిరికి కేవలం 4 కిలోమీటర్ల దూరంలో చంద్రబాబు స్వగ్రామం ఉంటుంది. కందుల వారి పల్లి పంచాయతీ లోకి వచ్చే ఈ గ్రామము ప్రస్తుతం నాలుగో దశలో ఎన్నికల సంగ్రామం లో ఉంది. కందుల వారి పల్లె పంచాయతీ ఈసారి జనరల్ మహిళ కు రిజర్వు అయింది. దింతో టీడీపీ, వైస్సార్సీపీ లు కొత్త ఎత్తులతో ఇప్పటికే అభ్యర్థులను రంగంలోకి దింపి ప్రచారం సైతం ముమ్మరంగా చేస్తున్నారు. గత ఎన్నికల్లో ఈ పంచాయతీ నుంచి 30 శాతం మేర వైఎస్ఆర్సిపి కు ఓట్లు లభించాయి. అలాగే గతంలో సైతం, ఎంపిటిసి లుగా, సర్పంచులు ప్రత్యర్థి పార్టీ వ్యక్తులు ఇక్కడ పని చేశారు. దీంతో ఈసారి ఈ పంచాయతీ ను ఎట్టి పరిస్థితిలో గెలుచుకునేందుకు వైఎస్ఆర్ సీపీ నేతలు గట్టి పట్టుదలతో ఉన్నారు. ఇప్పటికే కుప్పంలో టిడిపిని మట్టికరిపించిన ఉత్సాహంతో చంద్రబాబు సొంత గ్రామంలో కూడా పాగా వేస్తే, అది ఆయన ప్రతిష్ట ను దెబ్బ తీస్తుందని, నైతికంగా బాబు మీద పైచేయి సాధించవచ్చన్నది వైసీపీ నేతల మాట.
పక్కా వ్యూహం!
కందుల వారి పల్లి పంచాయతీ ఈసారి ఓసి మహిళలకు రిజర్వు అయినప్పటికీ అధికార పార్టీ వైఎస్సార్సీపీ తరఫున ఎస్సీ మహిళను నిలబెట్టారు. టీడీపీ మాత్రం అగ్రకులానికి ప్రాధాన్యం ఇచ్చింది. అభ్యర్థి విషయంలోనే కీలక అడుగు వేసినా వైస్సార్సీపీ నేతలు, ఆమె గెలుపు కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ప్రతి వార్డు ను సమన్వయం చేసేందుకు నియోజకవర్గస్థాయి నాయకులు ప్రయత్నిస్తున్నారు. ప్రతి ఓటర్ ను కలిసి ప్రభుత్వ సంక్షేమాన్ని వివరిస్తూ వైయస్సార్సీపి మద్దతుదారులకు ఓటు అభ్యర్ధిస్తున్నారు.
చెవిరెడ్డి ద్రుష్టి
కుప్పంలో అద్భుతమైన విజయం సాధించిన అధికార పార్టీ చంద్రబాబు స్వగ్రామంలో కూడా జెండా ఎగురవేయాలని గట్టిగా భావిస్తోంది. దీనికోసం చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ విడుదల దగ్గరనుంచే నారావారిపల్లె ఓటర్లను ప్రత్యేకంగా కలిసేందుకు, అక్కడి పరిస్థితులను ఎప్పటికప్పుడు వాక్యము చేసేందుకు ప్రత్యేకమైన ఒక బృందాన్ని ఏర్పాటు చేసారు. ప్రతి ఇంటికి వెళ్లి వారికి అందుతున్న పథకాలు, రాజకీయాలకు అతీతంగా వారికి ఇస్తున్న ప్రాధాన్యాన్ని వివరిస్తూనే ఓట్లు అడుగుతున్నారు. ఈ గ్రామంలో సుమారు 30 మేర దళితులు ఉంటారు. వారికీ తగిన ప్రాధాన్యం ఎప్పుడు చంద్రబాబు ఇచ్చింది లేదు. ఇప్పుడు ఏకంగా పంచాయతీ సర్పంచ్ గా దళిత మహిళను నిలబెట్టడం తో వారు ఎంతో ఆనందంగా కనిపిస్తున్నారు. ఎప్పటి నుంచో తాము కేవలం ఓట్లు వేసే వారీగా మిగిలిపోయామని, ఈ సారి తమ వర్గం నుంచి కచ్చితంగా పంచాయితీ సర్పంచ్ గెలిపించుకుంటామన్న మోసాలు వైఎస్ఆర్సిపి పార్టీ నేతలు వారి అందిస్తున్నారు. ఇప్పటికే నారావారిపల్లి లో రాజకీయ సందడి తారా స్థాయిలో కనిపిస్తోంది. ఇప్పుడు జిల్లా చూపంతా నారావారిపల్లె గ్రామం ఉన్న కందుల వారి పల్లి పంచాయతీ పైనే పడింది. దీంతో టీడీపీ, వైస్సార్సీపీ నేతలకు ఇది ప్రతిష్టాత్మక పంచాయతీ అయింది.