Idream media
Idream media
అయోధ్య వివాదంపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై పాకిస్థాన్ తీవ్రంగా స్పందించింది. భారతదేశంలో మైనారిటీలకు భద్రత లేదన్నది ఈ తీర్పు ద్వారా రుజువయ్యిందని పాకిస్థాన్ విదేశాంగ శాఖ కార్యాలయం శనివారం ఒక ప్రకటనలో వ్యాఖ్యానించింది. ఈ తీర్పు ద్వారా మైనారిటీలకు న్యాయం జరగలేదని పాకిస్థాన్ పేర్కొంది. సంఘ్ పరివార్ తన హిందుత్వ ఎజెండాను అమలుచేసే దిశగా భారత్‌ను ‘హిందూ దేశం’గా మార్చేందుకు చరిత్రను తిరగరాస్తోందని పాకిస్థాన్ విమర్శించింది. అయోధ్య వివాదంపై తీర్పు ఇచ్చేందుకు అక్కడి సుప్రీంకోర్టు ఎంచుకున్న సమయం సరికాదని పాకిస్థాన్ విదేశాంగ మంత్రి షా మహమూద్ కురేషి అన్నారు.
అయోధ్యలోని వివాదాస్పద స్థలం 2.77 ఎకరాలు రామజన్మ భూమి వ్యాస్ కు ఇస్తూ, మసీదు నిర్మాణానికి అయోధ్యలోనే 5 ఎకరాల స్థలం కేటాయించాలని సుప్రీం కోర్టు శనివారం తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే. మూడు నెలల్లో తీర్పు అమలు చేయాలని ప్రభుత్వాలకు గడువు విధించింది.