iDreamPost
android-app
ios-app

టిక్‌టాక్‌ను నిషేధించిన పాకిస్థాన్…

టిక్‌టాక్‌ను నిషేధించిన పాకిస్థాన్…

టిక్‌టాక్‌కు వరుసగా ఎదురుదెబ్బలు తగులుతూనే ఉన్నాయి. ఇప్పటికే భారత్‌, అమెరికా దేశాలు టిక్‌టాక్‌ యాప్‌పై నిషేధం విధించిన విషయం తెలిసిందే. తాజాగా పాకిస్థాన్ కూడా టిక్‌టాక్‌పై నిషేధం విధించిన దేశాల జాబితాలోకి చేరిపోయింది. చైనా దేశంతో అంట కాగుతూ ఆ దేశానికి చెందిన అప్లికేషన్ పై నిషేధం విధిస్తుందని చైనాకు చెందిన టిక్‌టాక్‌ మాతృసంస్థ బైట్ డాన్స్ కూడా ఊహించి ఉండదు.

టిక్‌టాక్‌లో అసభ్యకరమైన కంటెంట్‌ ఎక్కువ అవుతుందని పాకిస్థాన్‌ టెలీకమ్యూనికేషన్‌ అథారిటీకి వరుసగా ఫిర్యాదులు రావడంతో అలాంటి అసభ్యకరమైన కంటెంట్‌ను తొలగించాలని పాకిస్థాన్‌ టెలీకమ్యూనికేషన్‌ అథారిటీ(పిటీఏ) టిక్‌టాక్‌కు కొంత సమయాన్ని ఇచ్చింది. కానీ టిక్‌టాక్‌ పిటీఏ ఆదేశాలను పరిగణనలోకి తీసుకోలేదు. జులైలో ఆదేశాలు ఇచ్చినప్పటికీ ఇప్పటివరకు అసభ్యకరమైన కంటెంట్ తొలగించే విషయంలో ఎలాంటి చర్యలు తీసుకోనందున టిక్‌టాక్‌ను పాకిస్థాన్ లో నిషేధిస్తున్నట్లు పిటీఏ ఆదేశాలు జారీ చేసింది.

పాకిస్థాన్ నుండి టిక్‌టాక్‌కు దాదాపు 39 మిలియన్ల డౌన్లోడ్స్ ఉన్నాయి. ఇప్పటికే అతిపెద్ద మార్కెట్ కలిగివున్న ఇండియా, అమెరికా దేశాలు టిక్‌టాక్‌పై నిషేధం విధించి షాక్ ఇవ్వడంతో అయోమయంలో ఉన్న బైట్ డాన్స్ సంస్థ పాకిస్తాన్ కూడా నిషేధం విధించడంతో ఎలా స్పందింస్తుందో వేచి చూడాలి..