iDreamPost
android-app
ios-app

అమరావతి రైతులకు ఒక అవకాశం

అమరావతి రైతులకు ఒక అవకాశం

రాజధానిపై ఏర్పాటు చేసిన హైపవర్‌ కమిటీ సమావేశం ముగిసింది. ఆర్టీసీ కాన్ఫరెన్స్ హాల్‌లో భేటీ అయిన హాపర్ కమిటీ సమావేశం ముగిసిన అనంతరం మంత్రి పేర్ని నాని మీడియాతో మాట్లాడుతూ హైపవర్‌ కమిటీ భేటీ లో జిల్లాల వారిగా అభివృద్ధిపై సుదీర్ఘంగా చర్చించామన్నారు. అలాగే రాజధానిపై జీఎన్‌ రావు నేతృత్వంలోని నిపుణుల కమిటీ సిఫార్సులు, బోస్టన్‌ కన్సల్టెన్సీ గ్రూప్‌ (బీసీజీ) నివేదికపై కూడా చర్చ జరిపినట్లు మంత్రి తెలిపారు. రాజధాని రైతుల సమస్యలను సీఆర్డీఏ కమిషనర్‌కు తెలియజేయవచ్చని పేర్కొన్నారు. ఈనెల 17న మరోసారి హైపర్ కమిటీ భేటీ కానుందని, రాజధాని కి సంబందించిన 29 గ్రామాల రైతులు ప్రభుత్వానికి ఏం చెప్పదలుచుకున్నారో వ్యక్తిగతంగా కానీ రాతపూర్వకంగా కానీ సీఆర్డీఏ కమిషనర్‌కు 17 వ తారీఖు సాయంత్రం 5 గంటలులోగా తమ అభిప్రాయాలను, సూచనలను అందజేయాలని, సీఆర్డీఏ కమిషనర్‌ ని కలసి తమ సందేహాలను నివృత్తి చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. సీఆర్డీఏ కమిషనర్‌కు ఈ మెయిల్‌ ద్వారా కూడా సూచనలు, సందేహాలు పంపాలని కోరారు.

కేవలం రాజకీయ లబ్ధికోసం ఇతర ప్రాంతాల నుండి మహిళలను తీసుకొచ్చి రాజధాని ఉద్యమానికి వాడుకుంటున్నారని, బయటవారిని తీసుకొచ్చి రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. సానుభూతి కోసం ప్రీప్లాన్డ్‌గా రాజధాని ప్రాంతంలో ఆందోళనలు చేస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వంపై వ్యతిరేకత తెచ్చేందుకు ధర్నాలు ప్లాన్ చేస్తున్నారన్నారు. వీటి వెనక టీడీపీ ఉందని తెలిపారు. రాజధాని అంశంపై ఏం జరగబోతుందనే దానిపై రైతులకు పూర్తి క్లారిటీ ఉందని మంత్రి పేర్ని నాని అన్నారు. ఆ 29 గ్రామాల్లోని నిజమైన రైతాంగానికి అర్థమైందని తెలిపారు.

ఎవరైతే రాజకీయం కోసం ఈ అంశాన్ని వాడుకుంటున్నారో వారికి తప్ప అందరికీ న్యాయం జరగబోతుంది. రైతులతో పాటు రాజకీయంగా ప్రేరేపితం అయిన కొంతమంది ప్రీ ప్లాన్డ్ గా ఆందోళన చెస్తున్నారు. వీరి వెనకాల టీడీపీ నేతలు ఉన్నారని ఆరోపించారు. రైతులు కూడా మంత్రులను వ్యక్తిగతంగా కలుస్తున్నారు. వారి వినతులు కూడా చెప్తున్నారు. వాటన్నింటినీ స్వీకరిస్తాం అని అన్నారు. అలాగే ఈనెల 17న మరోసారి కమిటీ భేటీ అవుతుందని మంత్రి పేర్నినాని తెలిపారు.

అలాగేవ్యవసాయ శాఖ కన్నబాబు చంద్రబాబునుద్దేశించి మాట్లాడుతూ, ఆయనకి బాధ కలిగితే పండుగ చేసుకోకూడదు, ఆనందం కలిగితే పండగ చేసుకోవాలా ?? తానూ రాష్ట్రంలో ఎవరిని పండుగ చేసుకోవద్దని పిలుపునిచ్చి తన కుటుంబం మాత్రం తన సొంత గ్రామం నారావారిపల్లె లో సంక్రాంతి కార్యక్రమాల్లో ఎలా పాల్గొంటున్నారని ప్రశ్నించారు. కనీసం పండగ పూటైనా రైతులని ప్రేరేపించకుండా ఉంటే చాలని హితవు పలికారు.ఆఖరికి చంద్రబాబు సాక్షాత్తు రాష్ట్ర డీజీపీ ని కూడా విమర్శిస్తున్నారని మంత్రి కన్నబాబు మండిపడ్డారు.