iDreamPost
android-app
ios-app

సింధు సూపర్.. బోరగైన్ బంపర్ పెర్ఫార్మన్స్!

సింధు సూపర్.. బోరగైన్ బంపర్ పెర్ఫార్మన్స్!

ఒలింపిక్స్ లో ఆరో రోజు భారత్ కు కలిసి వచ్చిన రోజు. మొదటిరోజే పతకాన్ని సాధించిన భారత్ వెయిట్ లిఫ్టర్ మీరాబాయి చాను స్ఫూర్తి ఆరోరోజు కనిపించింది. అన్ని విభాగాల్లోనూ భారత క్రీడాకారులు మంచి ప్రతిభ చూపారు. రెండు విభాగాల్లో క్రీడాకారులు సెమీఫైనల్ వరకు వెళ్లి పతకాన్ని ఖాయం చేసుకున్నారు.

భారత స్టార్ షట్లర్ పూసల పాటి విజయ సింధు తన అద్భుత పెర్ఫార్మన్స్ ను చూపిస్తోంది. శుక్రవారం ఉదయం జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ లో జపాన్ కు చెందిన యమగుచి పై వరుస సెట్లలో విజయం సాధించింది. రెండో సెట్ ఆసక్తిగా సాగింది. యమగుచి గట్టిగా పోరాడిన సింధు బ్యాక్ హాండ్స్ షాట్లతో విరుచుకుపడడంతో హోరాహోరీగా జరిగిన రెండో సెట్లో సింధు దే పైచేయి అయింది. దీంతో పీవీ సింధు సెమీ ఫైనల్ కు చేరింది. దీంతో ఆమెకు పతకం కంఫర్మ్ అయ్యింది. ఆమె సెమీఫైనల్స్ లో చైనాకు చెందిన తపై జు యాంగ్ తో తలపడనుంది.

ఎలాంటి అంచనాలు లేకుండా బరిలోకి దిగిన భారత మహిళా బాక్సర్ లు ఈసారి అద్భుతంగా రాణిస్తారు. 69 కిలోల విభాగంలో శుక్రవారం లోవలైన్ బోరగైన్ క్వార్టర్ ఫైనల్లో విజయం సాధించింది. మొదటిసారి ఒలింపిక్స్కు అర్హత సాధించిన ఆమె మొదటినుంచి పదునైన పంచులతో ప్రత్యర్థిని ముప్పుతిప్పలు పెడుతోంది. శుక్రవారం నాటి క్వార్టర్ ఫైనల్ మ్యాచ్లో చైనాకు చెందిన మాజీ వరల్డ్ చాంపియన్ నిన్ చాన్ చిన్ పై గెలిచింది. 23 ఏళ్ల ఈ అస్సాం బాక్సర్ సెమీఫైనల్లో టర్కీకి చెందిన వరల్డ్ ఛాంపియన్ బుసేనాజ్ సర్మీనైల్ తో తలపడనుంది. అయితే ప్రస్తుత పెర్ఫామెన్స్ ఆధారంగా బోరగైన్ కు ఇప్పటికే పతకం కన్ఫర్మ్ అయ్యింది.

పురుషుల హాకీ లో ఇండియా జట్టు జపాన్ జట్టును ఓడించింది. క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. ఆస్ట్రేలియా మీద ఘోర పరాజయం తర్వాత పుంజుకున్న ఇండియా జట్టు వరుస విజయాలతో దూసుకుపోతోంది. అర్జెంటీనా మీద అద్భుత విజయం సాధించిన ఇండియా అదే దూకుడుతో జపాన్ మీద సైతం 5 గొల్స్ వేసి ఆధిపత్యం ప్రదర్శించింది. దూకుడైన ఆటతోనే ప్రత్యర్థిని ముప్పుతిప్పలు పెడుతున్న భారత స్టార్ట్ ఆటగాళ్లు కొత్త వేగంతో మైదానంలో కదులుతున్నారు. దీంతో శుక్రవారం నాటి మ్యాచ్లో 5-3 తేడాతో జపాన్ను మట్టికరిపించింది.

కచ్చితంగా పథకం తీసుకువస్తుందని ఎన్నో ఆశలు పెట్టుకున్న భారత స్టార్ దీపికా కుమారి నిరాశపరిచింది. వ్యక్తిగత విభాగం క్వార్టర్ ఫైనల్లో ఆమె పోరాడలేక పోయింది. దక్షిణ కొరియాకు చెందిన ఆన్ చేతిలో ఓడిపోవడంతో దీపికా కుమారి వ్యక్తిగత పోరాటం ముగిసినట్లయింది. మిగిలిన అథ్లెటిక్స్లో భారత్ క్రీడాకారులు ఎవరు అనుకున్నంత మేర ప్రతిభ చూపలేకపోయారు. మహిళ 100 మీటర్ల పరుగులో భారత అథ్లెట్ చంద్ 7 వ ప్లేస్ లో నిలిచారు. 25 మీటర్ల పిస్టల్ విభాగంలో ఇండియాకు చెందిన బాకర్ 17 వ ప్లేసులో ఉండిపోయారు. హర్ధిల్స్, గోల్ఫ్, సైలింగ్ ఇతర క్రీడలలో సైతం భారత్ అనుకున్న ఫలితాలు రాలేదు. ఆరో రోజు రెండు పతకాలు ఖాయం కావడంతో పాటు, జాతీయ క్రీడ హాకీ లో అద్భుతంగా రాణించడం శుభపరిణామం గా భావించాలి. ఇదే ఊపు కొనసాగిస్తే, ఖచ్చితంగా భారత్ మంచి ప్రతిభ చూపినట్లు అవుతుంది.