iDreamPost
android-app
ios-app

తెగని ‘స్థానిక’ పంచాయతీ

  • Published Jan 08, 2021 | 5:10 PM Updated Updated Jan 08, 2021 | 5:10 PM
తెగని ‘స్థానిక’ పంచాయతీ

స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్‌కు, రాష్ట్ర ప్రభుత్వాని మధ్య బేధాభిప్రాయాలు ఉన్న విషయం విదితమే. ఈ నేపథ్యంలో విషయం కోర్టు ముంగిటకు కూడా వెళ్ళింది. ఈ నేపథ్యంలో ఇరుపార్టీలు కూర్చుని మాట్లాడుకుని ఒక నిర్ణయానికి రావాల్సిందిగా హైకోర్టు సూచించింది. దీంతో ఎన్నికల కమిషనర్, ప్రభుత్వ చీఫ్‌ సెక్రటరీ ఆదిత్యనా«ద్‌దాస్‌ల నేతృత్వంలోని అధికారుల బృందం శుక్రవారం భేటీ అయ్యింది. తుది నిర్ణయాల మాటెలా ఉన్నప్పటికీ నిమ్మగడ్డ వ్యవహారంతో ఆది నుంచీ ఆసక్తికరంగా మారిన ఈ వ్యవహారం పట్ల సర్వత్రా ఆసక్తిగానే వేచి చూస్తున్నారు.

కాగా సకాలంలో ఎన్నికల జరక్కపోతే కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు నిలిచిపోతాయన్న వాదనను నిమ్మగడ్డ లేవనెత్తి నట్లుగా సమాచారం. కరోనా జాగ్రత్తలు తీసుకుంటనే ఎన్నికలను నిర్వహించాలని సీఎస్‌తో కూడిన అధికారుల బృందాన్ని కోరినట్లుగా సమాచారం. వ్యాక్సినేషన్‌ ఎప్పుడు ప్రారంభమవుతుందో తెలియనందున, ఇప్పట్నుంచే ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు చేయాల్సిందిగా నిమ్మగడ్డ చెప్పినట్లుగా తెలుస్తోంది.

అయితే ఎన్నికల నిర్వహణ పనుల్లో కీలకమైన ఉద్యోగులు వ్యాక్సినేషన్‌కు సిద్ధమవుతున్నారని చీఫ్‌సెక్రటరీతో కూడిన అధికారుల బృందం ఎన్నికల కమిషనర్‌కు వివరించినట్లుగా చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఎన్నికలు ఇప్పుడు నిర్వహించడం సాధ్యపడదని, నిర్వహణ కారణంగా ఎదురయ్యే ఇబ్బందులను కూడా కూలంకుషంగానే వివరించారంటున్నారు. కరోనా కొత్త స్ట్రెయిన్‌ కూడా పొంచి ఉన్న నేపథ్యంలో ప్రజలను ప్రమాదంలోకి నెట్టడం సరికాదన్నట్టుగా చెబుతున్నారు. ఎన్నికల వాయిదాటి కంటే క్లిష్టపరిస్థితులే ఉన్నాయని సంబంధిత వివరాలను కమిషనర్‌ ముందుంచినట్టుగా వార్తలొస్తున్నాయి. ప్రొసీడింగ్స్‌ ఇచ్చినట్టుగా ఫిబ్రవరిలో ఎన్నికల నిర్వహణ కాదని ప్రభుత్వం తరపున అధికారుల బృందం తేల్చి చెప్పేసారంటున్నారు.

ఇరు వర్గాలు ఎవరి వాదనలు, వివరణలు వారు చెప్పుకోగా తుది నిర్ణయం ఏంటన్నది ఇంకా తేలాల్సి ఉంది. ఎన్నికల కమిషనర్‌ హోదాలొ ఎన్నికలు జరిపించేందుకు హడావిడి పడితే కుదరదని ఇప్పటికే అధికార పార్టీ నుంచి పలువురు ముఖ్యనేతలు ఖరాకండీగానే చెప్పేసారు. అధికారులు కూడా సహేతుక కారణాలతోనే ఎన్నికలు ఇప్పుడు సాధ్యం కావన్నది తేల్చారు. అయినప్పటికీ నిమ్మగడ్డ.. ‘తాను పట్టుకున్న కుందేలుకు..’ అన్న సామెతను పదేపదే గుర్తు చేస్తుండడం సర్వత్రా విమర్శలకు తావిస్తోంది.

ప్రస్తుతం జరిగిన ఈ పంచాయతీలో ఎన్నికల కమిషనర్‌ లేవనెత్తిన అంశాలకంటే ప్రభుత్వ చీఫ్‌సెక్రటరీ ప్రస్తావించిన కీలక అంశాలను పలువురు మద్దతునిస్తున్నారు. కాగా ఈ భేటీలో ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్‌ పాల్గొనగా ప్రభుత్వ చీఫ్‌సెక్రటరీ ఆదిత్యనా«ద్‌దాస్‌ నేతృత్వంలో కీలక అధికారులు గోపాలకృష్ణ ద్వివేదీ, అనిల్‌కుమార్‌ సింఘాల్‌లు పాల్గొన్నారు.