రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దళిత యువకుడి శిరోముండనం కేసులోనిందితుడిగా ఉన్న నటుడు, నిర్మాత, బిగ్‌బాస్ కంటిస్టెంట్ నూతన్ నాయుడికి ఈ నెల18 వరకూ రిమాండ్ విధించారు.
వివరాల్లోకి వెళితే ఫోన్ దొంగిలించాడు అన్న నెపంతో తమ ఇంట్లో పని చేసి మానేసిన దళిత యువకుడికి నూతన్ నాయుడు కుటుంబ సభ్యులు శిరోముండనం చేసిన సంగతి తెలిసిందే. సీసీ కెమెరాల్లో రికార్డ్ అయిన శిరోముండనం దృశ్యాలు రాష్ట్ర వ్యాప్తంగా కలకలం సృష్టించాయి. దీంతో పోలీసులు నూతన్ నాయుడు భార్య సహా ఘటనలో పాల్గొన్న 7 మందిని అరెస్ట్ చేశారు.
కాగా కర్ణాటక ఉడిపిలో ఉన్న నూతన్ నాయుడిని పోలీసులు శనివారం అర్ధరాత్రి విశాఖకు తీసుకువచ్చారు. అనంతరం కేజీహెచ్‌లో వైద్య పరీక్షలు నిర్వహించి మేజిస్ట్రేట్ ముందు హాజరుపరచగా ఈనెల 18 వరకూ నూతన్ నాయుడికి రిమాండ్ విధించారు. దీంతో శిరోముండనం కేసులో మొత్తం 8 మందిని అరెస్ట్ చేశారు పోలీసులు. శిరోముండనం కాకుండా గతంలో రిటైర్డ్ ఐఏఎస్ అధికారి పీవీ రమేష్ పేరిట ఫేక్ కాల్స్ చేసిన వ్యవహారంలో నూతన్ నాయుడుపై కేసు నమోదైన విషయం తెలిసిందే.