Idream media
Idream media
ఏపీ అసెంబ్లీలో టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే, టీడీపీ ఉపనేత అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలతో చంద్రబాబు ఖంగుతిన్నారు. అచ్చెన్నాయుడు మాట్లాడుతూ ఓటుకునోటు కేసును హైకోర్టు కొట్టేసిందన్నారు.
ఓటుకునోటు కేసు కారణంగా రాష్ట్ర ప్రజలకు చంద్రబాబు తీవ్రంగా అన్యాయం చేశారని వైసీపీ కృష్ణాజిల్లా పెడన ఎమ్మెల్యే జోగి రమేష్, నెల్లూరు జిల్లా ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డి తదితరులు విమర్శించారు. విభజన అంశాలపై వచ్చిన ప్రశ్నకు మంత్రి కురసాల కన్నబాబు సమాధానం చెబుతూ గతంలో ఓటుకునోటు కారణంగా హైదరాబాద్ నుంచి పారిపోయి వచ్చిన చరిత్ర చంద్రబాబుదన్నారు. విభజన కు సంబందించి తెలంగాణ ప్రభుత్వంతో సంప్రదింపులు జరుగుతున్నాయని కన్నబాబు తెలిపారు. అయితే మధ్యలో అచ్చెన్నాయుడు జోక్యం చేసుకుని ఓటుకునోటు కేసు గురించి పదే పదే ప్రస్తావిస్తున్నారని, కాని దానిని హైకోర్టు కొట్టేసిందన్నారు.
అయితే అచ్చెన్నాయుడు జోక్యం చేసుకోవడంతో కాగా కాకాణి గోవర్ధనరెడ్డి, జోగి రమేష్ లు మళ్లీ మాట్లాడుతూ తెలంగాణలో ఎమ్మెల్సీని కొనుగోలు చేసే ప్రయత్నం జరిగింది అవాస్తవమా.? కాదా…? అక్కడ పట్టుబడింది నిజమా.? అబద్దమా.? మనవాళ్లు బ్రీఫ్ డ్ మీ అన్నది నిజం కాదా అంటూ పలు ప్రశ్నలు సంధించారు. అయితే మంత్రి కన్నబాబు తనకు తానుగా ప్రసంగం మధ్యలో ఓటుకునోటు గురించి మాట్లాడి కూర్చున్నారు. మధ్యలో అచ్చెన్నాయుడు ఓటుకునోటు గురించి ప్రస్తావించడం వల్లే దానిపై ఎక్కువగా చర్చ జరగడంతో చంద్రబాబు అచ్చెన్నాయుడి ముఖం చూసి నీవల్లే నేను ఇబ్బంది పడుతున్నా అని చెప్పినట్టు అర్ధమయ్యింది.