iDreamPost
android-app
ios-app

కిమ్ మరో సంచలన నిర్ణయం..

కిమ్ మరో సంచలన నిర్ణయం..

ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. బహిరంగ ప్రదేశాల్లో ధూమపానం నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు ఉత్తర కొరియా పీపుల్ అసెంబ్లీ తీర్మానించినట్టు ఉత్తరకొరియా అధికారక మీడియా తెలిపింది.

ఉత్తరకొరియా పౌరులకు పరిశుభ్రమైన జీవన వాతావరణం అందించడానికి పొగాకు నిషేధ చట్టం సిగరెట్ల ఉత్పత్తి, అమ్మకాలపై చట్టపరమైన సామాజిక నియంత్రణను కఠినతరం చేయాలని కిమ్ ప్రభుత్వం నిర్ణయించింది. కాగా ఉత్తర కొరియా ప్రజలు ధూమపానం ఎక్కువగా చేస్తూ ఉంటారు.ఆ దేశ అధ్యక్షుడు కిమ్ కూడా చైన్ స్మోకర్ కావడం గమనార్హం.

ప్రపంచ ఆరోగ్య సంస్థ 2013 అంచనా ప్రకారం 43.9 శాతం మంది పురుషులు ఉత్తరకొరియాలో ధూమపానం చేస్తున్నారు. కిమ్ ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంతో ఉత్తర కొరియా ప్రజల్లో ఏమైనా మార్పు వస్తుందేమో వేచి చూడాలి. కిమ్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను ఏ ఒక్కరు వ్యతిరేకించినా కఠిన శిక్షలు విధించే అవకాశం ఉన్నందున బహిరంగ ధూమపానం చేయడానికి ప్రజలు భయపడే అవకాశం ఎక్కువ ఉంటుందని పలువురు అభిప్రాయ పడుతున్నారు.