ఏపీ అసెంబ్లీలో చంద్రబాబు పరిస్థితి అగమ్యగోచరంగా మారుతోంది. సభలో రానురాను ఆయనకు అండగా నిలిచే టీడీపీ నేతలే కరువవుతున్నారు. ప్రజలు 23 మంది ఎమ్మెల్యేలను ఆయన వెంట గెలిపించి పంపిస్తే చివరకు ప్రస్తుతం ఆయనకు తోడుగా నిలుస్తున్న సభ్యుల సంఖ్య 13 మంది. అంటే 10 మంది ఎమ్మెల్యేలు ఏదో కారణంగా చంద్రబాబుకి తోడుగా నిలిచే పరిస్థితి కనిపంచలేదు. దాంతో సభలో 13 మంది సభ్యులతో చంద్రబాబు ఎక్కువ కాలం కొనసాగగలిగే అవకాశం లేదు. అందుకే చివరకు ఆయన ఏదో కారణంతో బయటకు వెళ్లేందుకు సన్నద్ధమయినట్టు కనిపిస్తోంది. అందుకు అనుగుణంగా తొలుత వాకౌట్ అస్త్రం సంధించినా, ఉపయోగపడకపోవడంతో ఆఖరికి అసెంబ్లీలో నేల మీద కూర్చుని, సస్ఫెండ్ అయ్యే పరిస్థితిని కొనితెచ్చుకున్నట్టు అంతా భావిస్తున్నారు.
ఏపీ అసెంబ్లీలో తుఫాన్ సహాయక చర్యల మీద చర్చ సాగుతోంది. దాని ప్రకారం సభలో అధిక వర్షాలతో నష్టపోయిన వారిని ఆదుకోవడానికి ప్రభుత్వం చేసే సహాయక చర్యలు ప్రస్తావించాల్సి ఉంటుంది. అందుకు అనుగుణంగా ప్రభుత్వం తన ప్రయత్నాలు సభకు వెల్లడించాల్సిన అవసరం ఉంది. అందుకు తగ్గట్టుగా సభలో వ్యవహారాలు సాగుతుండగా చంద్రబాబు తనకు అవకాశం ఇవ్వాలని పట్టుబట్టడం విడ్డూరంగా మారింది. అయితే వాస్తవానికి తనకున్న సభ్యుల సంఖ్య రీత్యా స్పీకర్ అవకాశం ఇస్తారని, అంతవరకూ వేచి ఉండాలనే ఆలోచన కూడా చంద్రబాబుకి లేదా అనే సందేహం వస్తుంది. కానీ నిజానికి చంద్రబాబుకి తెలిసే సభలో గందరగోళం సృష్టించే ప్రయత్నం చేసినట్టు భావించాల్సి ఉంటుంది. సభలో తన వెంట ఉన్న 13 మంది ఎమ్మెల్యేలతో కొనసాగడం, ప్రభుత్వాన్ని నిలదీయడం సాధ్యం కానందున, అనివార్యంగా పాలకపక్ష చర్యలను కొట్టిపారేయాలని పరిస్థితి ఉన్న తరుణంలో దాని నుంచి తప్పించుకునే లక్ష్యంతోనే హంగామా చేసినట్టు కనిపిస్తోంది.
తొలుత పంచాయితీరాజ్ సవరణ చట్టం చర్చ సందర్భంగా కూడా టీడీపీ అది అదే తంతు. సభ నుంచి వాకౌట్ చేయడం విడ్డూరంగా కనిపిస్తోంది. ఆ తర్వాత వరద బాధితుల సహాయానికి సంబంధించిన చర్చలో కూడా అదే పంథా. అంటే ఈ సమావేశాల సందర్భంగా టీడీపీ వ్యూహం స్పష్టంగా కనిపిస్తోంది. సభ సజావుగా సాగితే ప్రతిపక్షమే సమాధానం చెప్పాల్సిన పరిస్థితి ఉంటుందని చంద్రబాబు అనుమానిస్తున్నట్టు కనిపిస్తోంది. అందుకే సభలో గందరగోళం సృష్టించి, తాను బయటపడాలనే లక్ష్యంతో ఆయన సాగుతున్నట్టు స్పష్టమవుతోంది. తొలిరోజు పరిణామాలు దానికి ఉదాహరణగా నిలుస్తున్నాయి. అయినా చంద్రబాబుకి అధికార పార్టీ చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు విని, అంగీకరించేటంత ఓపిక లేకపోవడంతో ఆయన ఏదో కారణం చూపించి బయటకు వెళ్లడమే మేలనే అభిప్రాయం చాలామందిలో వినిపిస్తోంది. ఏమయినా టీడీపీ ఈ సారి సమావేశాల్లో తమకు సహనం లేదని, సంక్షేమ చర్యలను అంగీకరించలేమని చెప్పకనే చెబుతున్నట్టుగా