iDreamPost
android-app
ios-app

థియేటర్లు తెరిచిన ఆనందం తక్కువే

  • Published Aug 22, 2021 | 10:10 AM Updated Updated Aug 22, 2021 | 10:10 AM
థియేటర్లు తెరిచిన ఆనందం తక్కువే

దేశవ్యాప్తంగా థియేటర్లు తెరుచుకుంటున్నాయి. మొన్న అక్షయ్ కుమార్ బెల్ బాటమ్ తో నార్త్ లోనూ చాలా చోట్ల సినిమా హాళ్లు తెరిచారు. సోమవారం నుంచి తమిళనాడులో సెకండ్ షో లేకుండా 50 శాతం ఆక్యుపెన్సీతో నడుపుకోవడానికి స్టాలిన్ సర్కారు అనుమతులు జారీ చేసింది. అక్కడ కొత్త రిలీజుల ప్రకటనలు రాబోతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో గత నెల నుంచే ప్రేక్షకులు వినోదాన్ని అందుకుంటున్న సంగతి తెలిసిందే. అయితే ఇదంతా చూసి అంతా మళ్ళీ నార్మల్ అయిపోయిందని సంబరపడేందుకు లేదు. ఎందుకంటే పరిస్థితి ఊహించినంత ఆశాజనకంగా లేదు. కొన్ని చోట్ల స్పందన ఆందోళన కలిగించేలా ఉంది.

బెల్ బాటమ్ నే ఉదాహరణగా తీసుకుంటే మూడు రోజులు వచ్చిన నెట్ కలెక్షన్ కేవలం 8 కోట్లు మాత్రమే. మీడియాలో సినిమా గురించి చాలా పాజిటివ్ రివ్యూస్ వచ్చినప్పటికీ అవి ప్రేక్షకులను కదిలించలేకపోయాయి. అందులోనూ కథా కథనాలు మరీ కొత్తగా లేకపోవడం కూడా కొంత ప్రభావం చూపించినప్పటికీ తన మూవీకి గ్రాండ్ వెల్కమ్ దక్కుతుందని ఎదురు చూసిన అక్షయ్ కుమార్ కు ఇదంతా షాక్ కలిగించే వ్యవహారమే. హైదరాబాద్ లో కొన్ని మల్టీ ప్లెక్సుల్లో పట్టుమని పాతిక టికెట్లు కూడా అమ్ముడుపోలేదంటే అర్థం చేసుకోవచ్చు అసలు ఏం జరుగుతుందో. ఇక మన టాలీవుడ్ సినిమాల సంగతి చూస్తే ఇక్కడ కొన్ని ఆశ్చర్యపరిచే వాస్తవాలు కనిపిస్తాయి

గత నెల 30 నుంచి ఇప్పటిదాకా వచ్చిన సినిమాలు చూస్తే పాజిటివ్ టాక్ వచ్చినవి తిమ్మరుసు, ఎస్ఆర్ కళ్యాణ మండపం, రాజరాజ చోరలు మాత్రమే. వీటిలోనూ మొదటిది సేఫ్ కాలేకపోగా మిగిలిన రెండు బిజినెస్ కు తగ్గట్టు ప్రాఫిట్స్ అనిపించుకున్నాయే తప్ప ఫైనల్ రన్ లో కనీసం ఓ పది కోట్ల షేర్ ను కూడా టచ్ చేయలేని పరిస్థితిలో ఉన్నాయి. పాగల్ డివైడ్ టాక్ ఉన్నా పర్వాలేదనిపించుకుందే తప్ప విశ్వక్ సేన్ చెప్పుకున్న స్థాయిలో మేజిక్ చేయడంలో విఫలమయ్యింది. ఏ సినిమాకైనా శుక్ర శని ఆదివారాలు మినహాయించి మిగిలిన వీక్ డేస్ లో వసూళ్లు చాలా నెమ్మదిగా ఉన్నట్టు ఇప్పటికే ట్రేడ్ రిపోర్ట్ ఉంది. లవ్ స్టోరీ వచ్చేదాకా ఇందులో మార్పు ఉండేలా లేదు

Also Read: పరిశ్రమకు సవాల్ విసురుతున్న డిజిటల్ బూమ్