‘వి’ సినిమా ఓటీటీలో విడుదలవుతోంది. సెప్టెంబర్ 5న ఈ సినిమా విడుదల కానున్న విషయం విదితమే. దీంతోపాటుగా, మరికొన్ని సినిమాలు కూడా ఓటీటీ వైపు అడుగులేస్తున్నాయి. అందులో అనుష్క నటించిన ‘నిశ్శబ్దం’ కూడా వుందనేది తాజా ఖబర్. గత సమ్మర్‌లోనే ‘నిశ్శబ్దం’ ఓటీటీలో వచ్చేస్తుందన్న ప్రచారం జరిగింది. అయితే, ‘నిశ్శబ్దం’ దర్శక నిర్మాతలు అందుకు ససేమిరా అన్నారు. అమెజాన్ ప్రైవ్‌ు వంటి పలు ఓటీటీ సంస్థలు, ‘నిశ్శబ్దం’ దర్శక నిర్మాతలతో ఇప్పటికీ సంప్రదింపులు జరుపుతూనే వున్నారట. ఈ మధ్యనే జరిగిన చర్చల్లో కొంత సానుకూల ఫలితం వచ్చిందనే ప్రచారం జరుగుతోంది. అయితే, ఈ నెలలో ‘నిశ్శబ్దం’ ఓటీటీలో విడుదలయ్యే అవకాశం లేదంటున్నారు. అది నిజమేనా.? అసలు ఓటీటీ వైపు ‘నిశ్శబ్దం’ అడుగులేస్తోందా.? అన్నది తేలాల్సి వుంది. ప్రస్తుతానికి ఓటీటీ తప్ప సినిమాలకు ఇంకో మార్గం లేదు.
కీర్తి సురేష్ నటించిన ‘మిస్ ఇండియా’ కూడా ఓటీటీ వైపు చూస్తోందని సమాచారం అందుతోంది. సినిమా ది¸యేటర్లకు ఇప్పట్లో గ్రీన్ సిగ్నల్ లభించేలా లేకపోవడం, ఒకవేళ అక్టోబర్‌లో ది¸యేటర్లు తెరిచినా, ప్రేక్షకులకు ది¸యేటర్లకు వస్తారా.? రారా.? అన్న సందిగ్ధం నెలకొనడంతో చాలా సినిమాలు ఓటీటీ వైపు వెళ్ళక తప్పడం లేదని పలువురు సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కరోనా ప్రభావం లేకుండా వుండి వుంటే, ఈ సమ్మర్ సీజన్ తెలుగు సినీ పరిశ్రమకు కాసుల పంట పండించి వుండేదే. సమ్మర్ ఎలాగూ నష్టపోయింది సినీ పరిశ్రమ. దసరాపైనా ఆశలు లేవు. ఆశలన్నీ 2021 సంక్రాంతి మీదనే. అప్పటిదాకా ఆగేవి చాలా చాలా తక్కువ సినిమాలే. ఈలోగా మిగిలినవన్నీ ఓటీటీపై మెరవనున్నాయ్.