iDreamPost
android-app
ios-app

పులులకు మాంసం సరఫరా చేయొద్దంటూ అస్సాం బీజేపీ నేతల నిరసన

పులులకు మాంసం సరఫరా చేయొద్దంటూ అస్సాం బీజేపీ నేతల నిరసన

పులులు మరియు ఇతర అటవీ జంతువులకు ఆహారంగా గోమాంసం ఉపయోగించడంపై అభ్యంతరం తెలుపుతూ పులుల కోసం ఆహారాన్ని తీసుకువెళ్తున్న వాహనాలను కొందరు బీజేపీ నేతలు అడ్డుకున్నారు. ఇప్పుడీ సంఘటన వైరల్ గా మారింది.

వివరాల్లోకి వెళితే అస్సాం రాష్ట్రానికి చెందిన బీజేపీ నేత రంజన్ బోరా నాయకత్వంలోని చిన్న బృందం పులులకు గోమాంసం ఆహారంగా ఉపయోగించడాన్ని వ్యతిరేకిస్తూ గువహతిలోని జూకు మాంసాన్ని తరలిస్తున్న వాహనాలను అడ్డుకోవడంతో పాటు గోవధను నిషేధించాలని కోరుతూ నినాదాలు చేసారు. దీంతో జూ అధికారులు పోలీసులను పిలవాల్సి వచ్చింది. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు లాఠీఛార్జ్ జరిపి ఆందోళనకారులను చెదరగొట్టారు.

బీజేపీ నేత రంజన్ గోరా వాదన మరోలా ఉంది.. హిందూ సమాజంలో మేము ఆవుల రక్షణకు ప్రాముఖ్యత ఇస్తున్నామని, కానీ జంతుప్రదర్శనశాలలో మాంసాహార జంతువులకు గోమాంసాన్ని ప్రధానమైన ఆహారంగా ప్రభుత్వమే సరఫరా చేస్తుందని, పులుల ఆహారంలో గోమాంసం మినహాయించి ఇతర జంతువుల మాంసాన్ని వాడాలని సూచించారు. అంతేకాకుండా సాంబార్ జింకల జనాభా పెరిగిపోయిందని అందుకే వాటిలో ఆడ మగ జీవులను విడి విడిగా ఉంచాలని అభిప్రాయం వ్యక్తం చేశారు. దాంతో పాటు జూలో ఉండే మాంసాహార జీవులకు ఆహారంగా సాంబార్ జింకల మాంసాన్ని వడ్డించాలని అలా చేస్తే జూ స్వయం సమృద్ధి సాధిస్తుందని వెల్లడించారు.

ప్రస్తుతం బీజేపీ నేత రంజన్ గోరా గువహతి జూ బయట చేసిన నిరసన సోషల్ మీడియాలో వైరల్ అయింది. పులులకి మాంసం కాకుండా గడ్డి వడ్డించాలా అంటూ పలువురు నెటిజన్లు బీజేపీ నేత వ్యాఖ్యలను ట్రోల్ చేస్తున్నారు.