అదియునూ నీ భర్త ప్రాణాలు తప్ప…! అని యమ ధర్మరాజు సావిత్రితో అనే డైలాగ్ గుర్తుకు వస్తుంది. ఏపీ ఎస్ఈసీ నిమ్మగడ్డ తీరు. ఆయన ఆదేశాలు, స్పందనలు చూస్తుంటే ఎన్నికల నిబంధనలు అధికార వైసీపీకి తప్ప ఎవరికీ వర్తించవన్నట్లు ఉంది. మరీ ముఖ్యంగా పచ్చపార్టీ ఏ నిబంధనలు ఉండవన్నట్లు ప్రవర్తిస్తున్నారు. దీంతో వైసీపీ ఆరోపించినట్లు నిమ్మగడ్డను టీడీపీ వెనుక ఉండి నడిపిస్తుందన్న ఆరోపణలకు బలం చేకూరుతోంది.
ఎందుకంటే ఇంతవరకు ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా, గతంలో ఉన్న పథకాలు కొనసాగుతాయి. ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత ప్రభుత్వం కొత్త పథకాలు ప్రవేశ పెట్టకూడదు. కానీ ఏపీలో మాత్రం నిమ్మగడ్డ ఏ సంక్షేమ పథకమూ కొనసాగించవద్దు.అన్నింటిని ఎన్నికలు పూర్తయ్యే వరకు నిలిపి వేయమన్నట్లు ఆదేశాలు జారీ చేస్తున్నారు. అందుకు తాజీ ఉదాహరణ ఇంటింటికీ రేషన్ బియ్యం పంపిణీ. గతంలోనే దీనిని పైలెట్ ప్రాజెక్టు కింద శ్రీకాకుళం జిల్లాలో ఇంటింటికీ రేషన్ బియ్యం పంపిణీని అమలుచేశారు. అక్కడ ఎదురైన లోటుపాట్ల ఆధారంగా ఈ మొబైల్ వాహనాలను తీసుకొచ్చారు. అయితే, పేదలకు ఎంతో అవసరమైన ఈ పథకం ఎన్నికల కోడ్‌కు విరుద్ధమని, దాన్ని నిలిపివేయాలని సీఎస్‌కి ఎస్‌ఈసీ లేఖ రాశారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించడం.. న్యాయస్థానం ఐదు రోజుల్లోగా దీనిపై సానుకూల నిర్ణయం తీసుకోవాలని ఎస్‌ఈసీని ఆదేశించడం తెలిసిందే. దీనికి సంబంధించి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ త్వరగా నిర్ణయం తీసుకోవాలని పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని కోరారు అయినా నిమ్మగడ్డ నుంచి నో రెస్పాన్స్.
మరోవైపు ఎన్నికల వేళ దౌర్జన్యాలపై నిఘా వేయాలని కోరిన నిమ్మగడ్డ, టీడీపీ నేతలు చేసిన దౌర్జన్యాల గురించి పట్టడం లేదని తెలుస్తోంది. పేగా అదికార పార్టీ నేతలు ఫిర్యాదులు చేసినా నో రెస్పాన్స్. ఉదాహరణకు చిత్తూరు జిల్లా టీడీపీ ఎమ్మెల్సీ దొరబాబు ప్రవర్తించిన తీరు వివాదాస్పదమైంది. తనకు సంబంధం లేని యాదమర్రి మండలంలో తిష్ట వేసిన దొరబాబు ఆదివారం నాడు హాల్ చల్ చేశారు. నామినేషన్స్ జరుగుతున్న యాదమర్రి మండల పరిషత్ కార్యాలయం వద్ద తన అనుచరులతో రాద్ధాంతం చేశారు. ఎమ్మెల్సీ స్టిక్కర్ కారులో వచ్చిన దొరబాబు స్థానికులను తీవ్ర ఇబ్బందులకు గురిచేశారు. దొరబాబు వల్ల పెరియం బాడీకి చెందిన వారి మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘటనలో నలుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి.
ఈ ఘటన మీద స్థానిక ఎమ్మెల్యే ఎం ఎస్ బాబు మీడియాతో మాట్లాడుతూ.. దొరబాబు దాదా గిరిని ఖండించారు. సంబంధం లేని మండలానికి వాక్కువహిన దొరబాబు రౌడీ ఇజం చేశారన్నారు. ఆయన ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించారని, వెంటనే పోలీసులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దొరబాబు ను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. మరి ఈ విషయం నిమ్మగడ్డకు కనింపించిట్లుగా లేదు. ఆయన హాయిగా స్వగ్రాంలో పర్యటించారు.
మొత్తం మీద నిమ్మమగడ్డ వ్యవహారశైలి చూస్తుంటే టీడీపీకీ అనుకూల ఫలితాలు వచ్చేలా విశ్వప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రజాస్వామ్య ప్రక్రియను అపహాస్యం చేస్తూ ఎన్నికల ప్రక్రియను ఛిన్నాభిన్నం చేసి అధికారులను గందరగోళానికి గురి చేసేందుకు ఎస్ఈసీ నిమ్మగడ్డ టెక్నాలజీ చాటున ఎత్తుగడలకు దిగారన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పంచాయతీ ఎన్నికల కోసం ప్రత్యేకంగా రూపొందించుకున్న యాప్ ద్వారా ఎంపిక చేసుకున్న ఫిర్యాదులు మాత్రమే స్వీకరించేలా ఏర్పాట్లు చేసుకున్నట్లు అనుమానాలు బలపడుతున్నాయి. ఒకవైపు ఎన్నికలు ముంచుకొస్తున్నా ఎస్‌ఈసీ నిమ్మగడ్డ ఈ యాప్‌ను అత్యంత గోప్యంగా ఉంచడంపై సర్వత్రా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
టీడీపీ నేతలు తమ పార్టీ కంట్రోల్ రూమ్‌కు ఫిర్యాదులు పంపడం.. వాటిని నిమ్మగడ్డ యాప్‌కు చేరవేస్తున్నట్లు తెలుస్తోంది. తద్వారా అధికార వైఎస్సార్ సీపీ దౌర్జన్యాలకు పాల్పడుతోందని బురద చల్లేందుకు ప్రయత్నం జరుగుతోందని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ప్రజల ఓట్లతో గెలవడం అసాధ్యమని గత సార్వత్రిక ఎన్నికలు రుజువు చేయడంతో దొడ్డి దారి వ్యూహాలకు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు పదును పెడుతున్నట్లు వెల్లడవుతోంది. అందుకు నిమ్మగడ్డ తన పూర్తి సహాకారం అందిస్తున్నారన్న ఆరోపణలకు బలం చేకూరుతుంది.