iDreamPost
android-app
ios-app

నేడే నిజామాబాద్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ఫలితాలు

నేడే నిజామాబాద్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ఫలితాలు

నిజామాబాద్‌ స్థానిక సంస్థల శాసనమండలి స్థానం కోసం జరిగిన ఉప ఎన్నికలో గెలుపు ఎవరిని వరిస్తుందో నేడే తేలనుంది. ఓట్ల లెక్కింపు సోమవారం ఉదయం 8 గంటలకు మొదలుకానుంది. ఓట్ల లెక్కింపు కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.

నిజామాబాద్ ఎమ్మెల్సీ స్థానం కోసం జరిగిన ఈ ఉప ఎన్నికలో ఎలాగైనా గెలిచి సత్తా చాటాలని ప్రధాన రాజకీయ పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. టిఆర్ఎస్ నుండి కేసీఆర్ కుమార్తె మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత,కాంగ్రెస్‌ నుంచి వడ్డేపల్లి సుభాష్‌రెడ్డి, బీజేపీ నుంచి పోతన్‌కర్‌ లక్ష్మీనారాయణ పోటీ పడుతున్న ఈ ఎన్నికలో రెండు రౌండ్లలో ఫలితం తేలనుంది. అందుకోసం ఆరు టేబుళ్లు ఉపయోగించనున్నారు.

ఉదయం ఎనిమిది గంటలకు ప్రారంభం కానున్న ఓట్ల లెక్కింపు 10.30 కల్లా పూర్తి కానుందని సమాచారం. 824 మంది ఓటర్లలో 823 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉప ఎన్నిక ఫలితాలు వెలువడనున్న నేపథ్యంలో టిఆర్ఎస్ అభ్యర్థి కల్వకుంట్ల కవిత హైదరాబాద్‌ నాంపల్లిలోని యూసఫియన్‌ దర్గాను సందర్శించి చాదర్‌ను సమర్పించి ప్రత్యేక ప్రార్థనలు చేశారు.