iDreamPost
android-app
ios-app

మౌనం వెనుక నిశ్శబ్ద నేరం

  • Published Sep 21, 2020 | 7:50 AM Updated Updated Sep 21, 2020 | 7:50 AM
మౌనం వెనుక నిశ్శబ్ద నేరం

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న నిశ్శబ్దం ట్రైలర్ ఇవాళ రిలీజ్ చేశారు. గత కొద్దినెలలుగా విడుదల వాయిదా పడుతూ వచ్చిన ఈ సినిమా అక్టోబర్ 2న అమెజాన్ ప్రైమ్ ద్వారా వరల్డ్ ప్రీమియర్ కాబోతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ట్రైలర్ ఎలా ఉండబోతోందన్న ఆసక్తి అందరిలోనూ ఉంది. ఇక వీడియో విషయానికి వస్తే కథలోని మెయిన్ పాయింట్ రివీల్ చేసేశారు. సాక్షి(అనుష్క) మాటలు రాని వినపడని పెయింటింగ్ ఆర్టిస్ట్. అవతలి వ్యక్తుల పెదవుల కదలికలను బట్టి భావాలను అర్థం చేసుకుంటుంది. తనకు కావలసిన ఓ అరుదైన ఛాయాచిత్రం ఓ హాంటెడ్ హౌస్ లో ఉందని తెలుసుకుని మ్యుజిషియన్ ఆంటోనీ (మాధవన్)సహాయంతో అక్కడికి వెళ్తుంది.

కానీ వాళ్లకు అక్కడ అనూహ్యమైన సంఘటనలు, దెయ్యాలు ఉన్న జాడలు కనిపిస్తాయి. అంతుచిక్కని రీతిలో చిక్కుల్లో ఇరుక్కుంటారు. దీనికి చనిపోయిన ఓ అమ్మాయి(షాలిని పాండే)కి కనెక్షన్ ఉందని తెలుస్తుంది. విచారణ చేయడానికి ఆఫీసర్లు(అంజలి-మైకేల్ మ్యాడిసన్) రంగంలోకి దిగుతారు. అసలు సాక్షి ఈ వలయంలోకి ఎలా చిక్కుకుంది బయటపడిందనేదే అసలు స్టోరీ. ట్రైలర్ ఆసాంతం హాలీవుడ్ స్టైల్ లో సాగింది. కథ ప్రకారం విదేశాల్లో జరగడంతో లొకేషన్లతో సహా ఏదీ లోకల్ ఫ్లేవర్ లో కనిపించదు. సబ్జెక్టుకు తగ్గట్టు దర్శకుడు హేమంత్ మధుకర్ హై ఇంటెన్సిటీతో క్రైమ్ అండ్ హారర్ ని మిక్స్ చేసినట్టు తెలుస్తోంది. పాత్రలను ఎస్టాబ్లిష్ చేసిన తీరు, సస్పెన్స్ ని పేర్చుకుంటూ పోయిన క్రమం టెక్నికల్ గా ఉన్నతంగా ఉంది.

గోపి సుందర్ సంగీతం అందించినా బిజిఎం ఇచ్చిన గిరీష్ గోపాలకృష్ణన్ పనితనం ఎక్కువగా కనిపిస్తుంది. అనుష్క మూగ సైగల ద్వారానే తన మాటలను పలికించిన తీరు కొత్తగా ఉంది. మాధవన్ రోల్ లో చాలా షేడ్స్ ఉన్న క్లూ అయితే ఇచ్చేశారు. అంజలి, సుబ్బరాజు, షాలిని పాండే తదితర తారాగణం మంచి స్టైలిష్ గా ఉన్నారు. మొత్తానికి నిశ్శబ్దం తన మీద పెట్టుకున్న అంచనాలకు తగ్గట్టే డీసెంట్ ట్రైలర్ తో వచ్చింది. ఇందులో ఉన్న కంటెంట్ తో పాటు ఊహాతీతంగా కనక అసలు సినిమా ఉంటే కనక తెలుగులో తొలి ఓటిటి బ్లాక్ బస్టర్ ని ఆశించవచ్చు. ఈ నెల మొదటివారంలో వచ్చిన నాని వి అంచనాలు అందుకోవడంలో ఫెయిలవ్వడంతో ఇప్పుడు అందరి కళ్లూ దీని మీదే ఉన్నాయి. మరి సక్సెస్ పరంగా ఓటిటిలో నెలకొన్న సైలెన్స్ ని నిశ్శబ్దం బ్రేక్ చేస్తుందా లేదా ఇంకో 10 రోజుల్లో తేలిపోతుంది

Trailer Link Here @ bit.ly/2ZVVRmr