iDreamPost
android-app
ios-app

జోరుమీదున్న మెగా పెళ్లిసందడి

  • Published Dec 09, 2020 | 10:48 AM Updated Updated Dec 09, 2020 | 10:48 AM
జోరుమీదున్న మెగా పెళ్లిసందడి

నిన్నటి నుంచి సోషల్ మీడియాతో పాటు ఆన్ లైన్ లో మెగా డాటర్ నీహారిక పెళ్లి వేడుకల తాలూకు ఫోటోలు వీడియోలతో హోరెత్తిపోతోంది. నాగబాబు వ్యక్తిగతంగా కొన్ని పోస్టు చేస్తుండగా అక్కడికి విచ్చేసిన అతిథులు, వీడియో కవరేజ్ చేస్తున్న టీమ్ లోని సభ్యులు ఫోన్లలో షూట్ చేసిన బిట్లను లీక్ చేయడంతో అవి క్షణాల్లో వైరల్ అయిపోతున్నాయి. గెస్ట్ ఎవరు ఎయిర్ పోర్ట్ కు వచ్చినా దాని తాలూకు లైవ్ కవరేజ్ క్షణాల్లో మీడియాకు చేరిపోతోంది. రాత్రి పవన్ కళ్యాణ్ రాక స్పెషల్ అట్రాక్షన్ గా నిలవగా ఇంత పొడుగు ఉన్నాడేంటని అందరూ ఆశ్చర్యపోయేలా అకీరా నందన్ కూడా సర్ప్రైజ్ చేశాడు.

బయటి నుంచి ఒక్క రీతూ వర్మ, లావణ్య త్రిపాఠిలు మాత్రమే ఉదయ్ పూర్ వేడుకలో కనిపించారు. ఇక అందరూ మెగా కుటుంబ సభ్యులే. అల్లు అర్జున్, రామ్ చరణ్, కళ్యాణ్ దేవ్ లు సతీసమేతంగా హాజరయ్యారు. నాగబాబు తనకు వ్యక్తిగతంగా చాలా దగ్గరైన కొందరు టీవీ క్యాస్ట్ ఆండ్ క్రూని ప్రత్యేకంగా పిలివడం మినహాయించి ఇంకెవరూ రాలేదు. హైదరాబాద్ రిసెప్షన్ గ్రాండ్ గా ప్లాన్ చేశారు కాబట్టి టాలీవుడ్ మొత్తాన్ని ఆ రోజు భాగ్యనగరంలో చూడొచ్చు. నిన్న రాత్రి సంగీత్ సందర్భంగా అందరూ వయసులు మర్చిపోయి మరీ డాన్సులు చేయడం ఆల్రెడీ ఫ్యాన్స్ వాట్సప్ గ్రూపుల్లో చక్కర్లు కొడుతోంది.

ఇవాళ సాయంత్రం వరుడు చైతన్య నీహారిక మెడలో మూడు ముళ్ళు వేయబోతున్నాడు. కరోనా కారణంగా నిబంధనలు అన్నీ పాటిస్తూనే మంచి వాతావరణం ఏర్పరిచారు హోటల్ యాజమాన్యం. నీహారిక కాబోయే భర్తలో హీరో ఫీచర్స్ ఉన్నాయని త్వరలో తెరకు పరిచయం చేసినా ఆశ్చర్యం లేదని అప్పుడే కామెంట్స్ కూడా మొదలయ్యాయి. ఆచార్య షూటింగ్ కొద్దిరోజుల క్రితమే మొదలైనప్పటికీ ఈ వివాహం కోసమే చిరంజీవి కొంత డిలే చేశారు. ఇది కూడా పూర్తవుతోంది కాబట్టి ఈ నెలాఖరున లేదా జనవరిలో షూటింగ్ లో జాయిన్ అవుతారు. చరణ్ ఆర్ఆర్ఆర్, బన్నీ పుష్క యూనిట్లు కూడా వాళ్ళ హీరోల కోసం ఎదురు చూస్తున్నాయి.