iDreamPost
iDreamPost
గుజరాత్ లోని ముంద్రా పోర్టులో ఇటీవల స్వాధీనం చేసుకున్న హెరాయిన్ కు ఆంధ్రప్రదేశ్ కు ఎటువంటి సంబంధం లేదని కేంద్ర రెవెన్యూ ఇంటిలిజెన్స్ (డీఆర్ఐ) వర్గాలు పేర్కొన్న నేపథ్యంలో ఇన్నాళ్లుగా వైఎస్సార్ సీపీ నాయకులపై ఆరోపణలు చేస్తున్న చంద్రబాబునాయుడు అండ్ కో ఏమంటుందో? అఫ్ఘానిస్తాన్ నుంచి ఇరాక్ మీదుగా గుజరాత్ కు దిగుమతి అయిన రూ. 21 వేల కోట్ల విలువైన హెరాయిన్ గమ్యస్థానం ఢిల్లీయేనని డీఆర్ఐ ప్రాథమికంగా నిర్థారణకు వచ్చింది.
దేశ భద్రతకు సంబంధించిన ఈ మాదకద్రవ్యాల అక్రమ తరలింపు కేసు దర్యాప్తును కేంద్ర హోంశాఖ జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ)కు అప్పగించిన విషయం విదితమే. డీఆర్ఐ, ఇతర నిఘా సంస్థలను తప్పుదారి పట్టించేందుకే స్మగ్లర్లు విజయవాడ చిరునామాను వాడుకున్నట్టు , ఆంధ్రప్రదేశ్ కు సంబంధం లేదని ఈ కేసుకు సంబంధించిన
నివేదికలో పేర్కొనడం గమనార్హం.
Also Read : బోటు కాలిన ఘటనలో టీడీపీ నేతలకు పోలీసుల షాక్, వారం రోజుల గడువుతో నోటీసులు
అఫ్ఘాన్ కేంద్రంగా పనిచేస్తున్న ముఠా హెరాయిన్ దిగుమతికి సుధాకర్ దంపతులను కిరాయి ప్రాతిపదికన వాడుకుందని డీఆర్ఐ గుర్తించింది. ఈ క్రమంలోనే విజయవాడ చిరునామాతో రిజిస్టర్ చేసిన ఆషీ ట్రెండింగ్ కంపెనీ పేరును వాడుకో నేందుకు సుధాకర్ దంపతులు సమ్మతించారని తేలింది. సెప్టెంబర్ 14, 15 తేదీల్లో పెద్ద ఎత్తున స్వాధీనం చేసుకున్న హెరాయిన్ కాకుండా ఆషీ ట్రెండింగ్ కంపెనీ పేరుతో జూన్ నెలలో కూడా అఫ్ఘానిస్తాన్ నుంచి రెండు కంటైనర్ల హెరాయిన్ ముంద్రా పోర్టులో దిగుమతి చేసుకున్నట్టు డీఆర్ఐ గుర్తించింది. ఆ సరుకును కూడా ఢిల్లీ తరలించారని, విజయవాడకు గానీ, ఆంధ్రప్రదేశ్ లోని ఇతర ప్రదేశాలకు గానీ సంబంధం లేదని డీఆర్ఐ అధికారులు చెబుతున్నారు.
ఈ కేసు నిందితులను కోర్టులో ప్రవేశ పెట్టినప్పుడు న్యాయమూర్తి చేసిన వ్యాఖ్యలు కూడా ప్రాధాన్యత సంతరించుకున్నాయి. విజయవాడకు చెందిన సంస్థ హెరాయిన్ దిగుమతి చేసుకొంటే పశ్చిమ తీరాన గుజరాత్ లో ఉన్న ముంద్రా పోర్టుకు ఎందుకు తెస్తారు? విజయవాడ సమీపంలో తూర్పు తీరంలో పోర్టులు ఉన్నాయి కదా అని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు.
పటిష్ట దర్యాప్తు..
ఈ దందాలో దేశ వ్యతిరేక, ఉగ్రవాద శక్తుల ప్రమేయం ఉన్నట్టు కేంద్ర హోంశాఖ అనుమానిస్తోంది. అందుకే కేసు దర్యాప్తును పటిష్టంగా నిర్వహించేందుకు ఎన్ఐఏకు అప్పగించింది. కేంద్ర దర్యాప్తు సంస్థ విచారణలో వాస్తవాలు ఈ రకంగా వెలుగు చూస్తుంటే చంద్రబాబు అండ్ కో వైఎస్సార్ సీపీ నాయకులపై రోజుకో రకంగా ఆరోపణలు చేస్తున్నాయి.
Also Read : టీడీపీ పట్టాభికి షాకిచ్చిన కాకినాడ మత్స్యకారులు
అఫ్ఘానిస్తాన్ నుంచి దిగుమతులట.. తాలిబన్లతో సంబంధాలట..
వైఎస్సార్ సీపీ నేతలకు తాలిబన్లతో సంబంధాలు ఉన్నాయని, నేరుగా అక్కడి నుంచి హెరాయిన్ దిగుమతి చేసుకుటున్నారని టీడీపీ నాయకులు ఇక్కడ నానా యాగీ చేస్తున్నారు. దున్నపోతు ఈనిదంటే దూడను కట్టేయండి అన్నట్టు అ పార్టీ నేతలు, వారి అనుంగు మీడియా వ్యవహరించడం గమనార్హం. ముంద్రా పోర్టుకు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కు ముడిపెట్టేసి తెలుగుదేశం నాయకులు ఆరోపణలు చేయడం దానికి టిడిపి అనుకూల మీడియాలో ప్రచారం చేయడం అంతా ఒక పథకం ప్రకారం సాగిపోతోంది.
ముందుగా విజయవాడకు ప్రభుత్వానికి లింకు పెట్టి హడావిడి చేసిన టీడీపీ ఇప్పుడు కాకినాడ పోర్టుకు, ఎమ్మెల్యే చంద్రశేఖరరెడ్డికి ముడిపెట్టి నానా యాగీ చేస్తోంది. ఆ పార్టీ నాయకులు దూలిపాళ్ల నరేంద్ర, కొమ్మారెడ్డి పట్టాభి, వర్ల రామయ్య తదితరులు అదే పనిగా తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. పదే పదే ఆవే ఆరోపణలు చేస్తూ, తమ మీడియాలో ఊదర గొట్టేస్తే జనం నమ్ముతారనేది టీడీపీ నాయకులు వ్యూహం. ఒకపక్క పక్కాగా ఎన్ఐఏ దర్యాప్తు సాగుతూ వాస్తవాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తుంటే టీడీపీ నాయకులు బరితెగించి చేస్తున్న ఆరోపణలు వారి నైజాన్ని బయట పెడతాయే తప్ప నిజం అనే నిప్పును కప్పి పెట్టలేవు.
Also Read : బాబు మెడకు చుట్టుకుంటున్న డ్రగ్స్ వ్యవహారం