iDreamPost
android-app
ios-app

సినిమా ఈవెంట్లలో కొత్త ట్రెండ్

  • Published Nov 15, 2020 | 10:14 AM Updated Updated Nov 15, 2020 | 10:14 AM
సినిమా ఈవెంట్లలో కొత్త ట్రెండ్

ఇప్పటిదాకా కేవలం సినిమాలకు సంబంధించిన ప్రీ రిలీజ్ ఫంక్షన్లు, ఆడియో వేడుకలు, సక్సెస్ మీట్లు చూసిన ప్రేక్షకులకు, మీడియాకు ఆహా యాప్ కొత్త ట్రెండ్ మొదలుపెట్టింది. చాప కింద నీరులా థియేటర్ల వ్యవస్థను సవాల్ చేసే స్థితికి చేరుకున్న ఓటిటి రంగంలో ఓన్లీ తెలుగు కంటెంట్ ట్యాగ్ తో మార్కెట్ ను స్థిరపరుచుకునేందుకు దీన్ని నడిపిస్తున్న అల్లు అరవింద్ మరోసారి తన మాస్టర్ బ్రెయిన్ కు పదును పెట్టారు. ఎన్నడూ లేని రీతిలో ఆహాకు మొన్న గ్రాండ్ ఈవెంట్ ఒకటి చేశారు. ఎందరో ఇండస్ట్రీ ప్రముఖులతో పాటు ఏకంగా స్టైలిష్ స్టార్ నే గెస్ట్ గా తీసుకురావడంతో దీని మీద సాధారణ ప్రేక్షకులకూ ఆసక్తి కలిగింది.

సుమారు మూడున్నర గంటల పాటు రకరకాల వెబ్ సిరీస్ లు, టాక్ షోలు, ఈవెంట్లు, సినిమాలు పరిచయం చేస్తూ వాటి తాలూకు ప్రమోషన్లు టేకప్ చేసిన టీమ్ల వివరాలు అన్నీ తెలిసేలా డిజైన్ చేశారు. యాంకర్స్ గా నవదీప్, వైవా హర్ష చేశారు. కామెడీ అంతగా పండనప్పటికీ ఏదోలా మేనేజ్ అయితే చేశారు. ఆహా మొదట్లో అడల్ట్స్ ఓన్లీ అనిపించేలా చేసిన కంటెంట్ మీద నెగటివ్ ఫీడ్ బ్యాక్ రావడంతో మెల్లగా రూటు మారుస్తోంది. సమంతా, తమన్నా, పాయల్ రాజపూత్ లాంటి పేరున్న హీరోయిన్లను ఆహా కోసం వర్క్ చేసేలా ఆకర్షణీయ రెమ్యునరేషన్లతో తనవైపు తిప్పుకుంటోంది.

చూస్తుంటే రానున్న రోజుల్లో ఇకపై ఓటిటి సంస్థలు కూడా ఇలా ఈవెంట్లు చేయాల్సిన పరిస్థితి రావొచ్చు. ఫలానా సినిమా గురించో లేదా వెబ్ సిరీస్ రాబోతుందనో జనానికి తెలిసేలా న్యూస్ ఛానల్స్ లో లైవ్ కవరేజ్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే స్మార్ట్ టెక్నాలజీతో పోటీ పడేలా థియేటర్లు సిద్ధపడాలన్న మాట. ఈ ట్రెండ్ ఇకపై కూడా కొనసాగుతుందా లేక పూర్వంలా పబ్లిక్ సినిమా హాళ్లకు రావడం మొదలుపెడితే ఈ హవా తగ్గుతుందా అంటే ఇప్పుడే చెప్పలేం కానీ మొత్తానికి ఇదో కొత్త పోకడ అనే చెప్పాలి. టీవీ ఛానల్స్ కే పరిమితమైన టాక్ షోలు ఓటిటికి కూడా విస్తరించడం చూస్తే ఇది గాలిబుడగ కాదనే అనిపిస్తోంది