iDreamPost
android-app
ios-app

అవును.. “దేవుడే” కాపాడుతున్నాడు.. : చంద్రబాబుకు నెటిజన్ల కౌంటర్

అవును.. “దేవుడే” కాపాడుతున్నాడు.. : చంద్రబాబుకు నెటిజన్ల కౌంటర్

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వంపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు శుక్ర‌వారం మ‌ధ్యాహ్నం చేసిన ట్వీట్ కు అత్య‌ధిక మంది నెటిజ‌న్లు బాబుకు షాక్ ఇచ్చేలా రీట్వీట్ చేశారు. అవును.. “దేవుడే” కాపాడుతున్నాడు ఏపీ ని అంటూ కొంద‌రు స‌మాధానం ఇచ్చారు. ఆప‌ద స‌మ‌యంలో ప్ర‌భుత్వానికి అండగా ఉండాల్సింది పోయి.. ప్ర‌తిప‌క్ష నేత‌ చంద్ర‌బాబు, ఆయ‌న కుమారుడు లోకేష్ ప్ర‌భుత్వంపై బుర‌ద జ‌ల్లుతూనే ఉన్నారు. ట్విట‌ర్ వేదిక‌గా ఆరోప‌ణ‌లు కురుపిస్తున్నారు. ఇందుకు తాజా ఉదాహ‌ర‌ణే నిద‌ర్శ‌నం.

దేశమే నివ్వెర‌పోయేలా ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఒకేరోజు 1088 అత్యంత అధునాత‌న అంబులెన్స్ ల‌ను అందుబాటులోకి తెచ్చిన విష‌యం తెలిసిందే. అవ‌న్నీ పేద‌ల సేవ‌ల్లో నిమ‌గ్నం అయ్యాయి. ఏ జిల్లాకు కేటాయించిన వాహ‌నాలు.. ఆయా జిల్లాల్లో సేవ‌లు అందిస్తున్నాయి. ఆప‌ద‌లో ఉన్న వ్య‌క్తి ఫోన్ చేసిన కొద్ది నిమిషాలకే అవి చేరువ‌వుతున్నాయి. జ‌గ‌న్ నిర్ణ‌యానికి యావ‌త్ దేశామే ప్ర‌శంసించింది. చివ‌ర‌కు ప‌వ‌న్ క‌ల్యాణ్ కూడా జ‌గ‌న్ భేష్ అని మెచ్చుకున్నారు. డాక్ట‌ర్లు, రోగులు, ప్ర‌జ‌లు ఎంతో సంతోషం వ్య‌క్తం చేశారు. కానీ చంద్ర‌బాబు నాయుడు మాత్రం పంథా మార్చుకోలేదు.

తాజా ఘ‌ట‌న ప‌రిశీలిస్తే…

‘‘కోవిడ్-19 అనుమానిత లక్షణాలు ఉన్న వారిని ఆంబులెన్స్‌లో గొర్రెల మందలుగా ఎక్కించడం దారుణం. ఇలా చేయడం వల్ల వైరస్ లేని వారికి కూడా కరోనా సోకే ప్రమాదం ఉంది. ఇది 108 పబ్లిసిటీ కోసం చేస్తున్నారా?, లేక మరిన్ని కేసులు ఏపీలో పెంచేందుకు చేస్తున్నారా?, ఇక ఏపీని ఆ దేవుడే రక్షించాలి.’’ అంటూ చంద్రబాబు శుక్ర‌వారం ట్వీట్ చేశారు. అయితే అక్క‌డ అంద‌రూ ఒకే సారి అంబులెన్స్ ల‌కు ఫోన్ చేశారు. ఒక్కొక్క‌టి వ‌చ్చే లోపే త‌మ‌కున్న ఆందోళ‌న కొద్దీ వ‌చ్చిన వాహ‌నంలోనే వెళ్లేందుకు అంద‌రూ ప్ర‌య‌త్నించారు. దీనికి సంబంధించిన వీడియో పోస్ట్ చేసి చంద్ర‌బాబు ట్వీట్ చేశారు.

జ‌న‌మే స‌మాధానం చెబుతున్నారు…

చంద్ర‌బాబు, త‌న‌యుడు లోకేష్ ఏపీ ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా ఎప్పుడు ఏ ట్వీట్ చేసిన నెటిజ‌న్లు రివ‌ర్స్ లో స్పందిస్తున్నారు. ప్ర‌భుత్వానికి మ‌ద్ద‌తుగానే ఎక్కువ మంది రీట్వీట్ చేస్తున్నారు. తాజా ట్వీట్ కు సంబంధించిన‌వే కొన్ని రీట్వీట్ లు ప‌రిశీలిస్తే ఇలా ఉన్నాయి.. “

మీరు 2019 లో పోయినప్పుడే దేవుడు కాపాడాడు ఏపీని” అని ఒక‌రు.. “సర్.. మీరు చెప్పిన‌ట్లుగా.. ప్ర‌తి రోగికీ ఒక అంబులెన్స్ పంపాలంటు.. అప్పుడు ఎన్ని అంబులెన్సులు అవసరం. అది సాధ్య‌మేనా..? ఎన్నో సంవ‌త్స‌రాలు సీఎం చేశారు. మీకు తెలీదా సార్.. ఇటువంటి పోస్టులు పెట్టి దయచేసి మీ విలువను తగ్గించుకోకండి..” అని మ‌రొక‌రు.. ” ఆప‌ద కాలంలో విమ‌ర్శ‌లు చేయ‌డం త‌గ‌దు. వీలైన స‌ల‌హాలు ఇవ్వండి. ఎక్కువ కాలం సీఎంగా ఉండి మీరు ఏం చేశారో.. అంద‌రికీ తెలుసు..” అని ఇంకొంద‌రు.. వైర‌స్ నియంత్ర‌ణ‌లో ప్ర‌భుత్వం బాగా ప‌ని చేస్తోంది. ప‌ని చేయ‌డ‌మే త‌ప్ప‌.. ప్ర‌చారం కోసం చూడ‌డం లేదు. మీకు ప్ర‌చారం అవ‌స‌రం. లేక‌పోతే జ‌నాలు మ‌రిచిపోతారు. అందుకేనా ఇలాంటివి.. అని కొంద‌రు.. “మీ ప్రభుత్వంలో, ప్రభుత్వ ఆసుపత్రి వ్యవస్థ దెబ్బతింది. అంబులెన్స్ వ్యవస్థ చ‌చ్చిపోయింది. జ‌గ‌న్ దానికి ప్రాణం పోశారు..” అని ఇలా చాలా మంది ఏపీ ప్ర‌భుత్వానికి మ‌ద్ద‌తుగా చంద్ర‌బాబు పోస్టుకు రిప్ల‌య్ ఇచ్చారు. కొంద‌రు మాత్రం.. అంబులెన్స్ సిబ్బంది అంత మందిని ఎక్కించుకోకుండా ఉంటే బాగుండున‌ని సూచ‌న‌లు చేశారు.