iDreamPost
iDreamPost
ఇటీవలే అఖండ లుక్ తో మాస్ ఆడియన్స్ లో అంచనాలు పెంచేసిన నందమూరి బాలకృష్ణ ఇదవ్వగానే క్రాక్ ఫేమ్ గోపీచంద్ మలినేని డైరెక్షన్లో మైత్రి సంస్థ నిర్మించే భారీ సినిమా షూటింగ్ మొదలుపెట్టేస్తారు. ఇప్పటికే దర్శకుడు లైబ్రరీల చుట్టూ తిరుగుతూ దశాబ్దాల క్రితం జరిగిన సంఘటనల వివరాలను సేకరించే పనిలో పడ్డారు. అఖండ విడుదల మే 28ని గతంలోనే ప్రకటించారు. ఇప్పటికైతే మార్పు లేదు కానీ కరోనా వల్ల మారుతున్న పరిస్థితుల దృష్ట్యా ఎప్పుడు ఏం జరగబోతోందో ఊహించడం కష్టమే. రూలర్ తో అవుట్ డేటెడ్ దర్శకులతో చేయడం వల్ల వచ్చే ఫలితం చూసిన బాలయ్య ఇప్పుడంతా కొత్త జెనరేషన్ ని టార్గెట్ చేస్తున్నారు
లేటెస్ట్ అప్ డేట్ ప్రకారం పటాస్, సుప్రీమ్, రాజా ధి గ్రేట్, ఎఫ్2, సరిలేరు నీకెవ్వరుల వరస విజయాలతో దూసుకుతున్న అనిల్ రావిపూడికి బాలయ్య గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా ఫిలిం నగర్ టాక్. చాలా ఏళ్ళ క్రితమే ఈయన ఇమేజ్ కి సరిపోయే ఓ పవర్ ఫుల్ సబ్జెక్టుని రామారావుగారు పేరుతో రెడీ చేసి పెట్టానని అనిల్ ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. ఇప్పుడు ఓకే అయ్యింది ఇదేనా లేక మరొకటా అనే క్లారిటీ ఇంకా రావాల్సి ఉంది. ఇంకా అఫీషియల్ కాలేదు. కరోనా పాజిటివ్ రావడంతో హోమ్ క్వారెంటైన్ లో ఉన్న అనిల్ రావిపూడి వచ్చే నెల నుంచి ఎఫ్3 ని కొనసాగించబోతున్నారు. రెండు వారాలు అనుకోని బ్రేక్ రావడంతో కొత్త కథల మీద ఫోకస్ పెడుతున్నారు.
మరి బాలయ్య-అనిల్ కాంబోలో వచ్చేది రామారావుగారా కాదా అనేది తెలియాల్సి ఉంది. తన తండ్రి పేరు కాబట్టి టైటిల్ పరంగా పెద్దగా అభ్యంతరం ఉండకపోవచ్చు.దీని తర్వాత కూడా ఇప్పటి తరం దర్శకులతోనే చేయాలనీ బాలకృష్ణ డిసైడ్ అయినట్టుగా ఇన్ సైడ్ టాక్. తనకు ఎవర్ గ్రీన్ బ్లాక్ బస్టర్స్ ఇచ్చి ప్రస్తుతం ఫామ్ కోల్పోయిన బి గోపాల్ ప్రాజెక్ట్ కూడా పట్టాలు ఎక్కడం కష్టమేనని వినికిడి. ఒక్కసారి కెరీర్లో పట్టు తప్పిన సీనియర్ అగ్ర దర్శకులు మళ్ళీ ఫామ్ లోకి రావడం అనేది చాలా అరుదు. అఖండ ఫలితం వచ్చేలోగా లైన్ లో ఉన్న మరో రెండు మూడు కథల్లో ఏదో ఒకటి ఫైనల్ చేసే అవకాశాలు ఉన్నాయట