iDreamPost
android-app
ios-app

OTTలో మరో స్టార్ మూవీ

  • Published Jul 23, 2021 | 10:44 AM Updated Updated Jul 23, 2021 | 10:44 AM
OTTలో మరో స్టార్ మూవీ

థియేటర్లు ఇవాళ నుంచి తెలుగు రాష్ట్రాల్లో తెరుచుకున్నాయి. అయితే అన్నీ కాదు లెండి. చాలా పరిమిత సంఖ్యలో ఊరికి ఒకటో రెండో తప్ప ఎక్కువ ఓపెన్ కాలేదు. నేరగాడు, మాన్స్ టర్స్ విధ్వంసం అనే రెండు డబ్బింగ్ సినిమాలు తప్ప ఇంకే రిలీజులు లేవు. ఉదయం వైజాగ్ జగదాంబ కాంప్లెక్స్ లో శారద స్క్రీన్ లో నేరగాడుకి 40 రూపాయల సెకండ్ క్లాస్ ఫుల్ కావడం గమనార్హం. చెప్పుకోదగ్గ చిత్రాలు కాకపోవడంతో పబ్లిక్ అంత సుముఖత చూపడం లేదు కానీ నోటెడ్ మూవీస్ వస్తే మాత్రం బాక్సాఫీస్ దగ్గర సందడి ఖాయం. వీటి సంగతి ఎలా ఉన్నా మరోపక్క ఓటిటి డీల్స్ మాత్రం జరుగుతూనే ఉన్నాయి. నారప్ప సక్సెస్ ఇంకొందరికి స్ఫూర్తినిచ్చేలా ఉంది.

తాజాగా నయనతార నటించిన నేత్రికన్ ని డైరెక్ట్ డిజిటల్ లో రిలీజ్ చేయబోతున్నట్టు హాట్ స్టార్ అఫీషియల్ గా ప్రకటించింది. గత ఏడాది అమ్మోరు తల్లిని స్ట్రీమింగ్ చేసింది కూడా ఈ సంస్థే. సైకో కిల్లర్ బ్యాక్ డ్రాప్ లో మిలింద్ రావు దర్శకత్వం వహించిన ఈ సినిమాపై అంచనాలు బాగానే ఉన్నాయి. ఇందులో నయనతార కళ్ళు లేని యువతీ పాత్రను చేసింది. మిస్కిన్ తీసిన సైకో తరహాలోనే స్టోరీ లైన్ కనిపిస్తున్నప్పటికీ థ్రిల్లింగ్ స్క్రీన్ ప్లేతో మిలింద్ రావు దీన్ని తీశారని చెన్నై మీడియా టాక్. నేత్రికన్ తెలుగు వెర్షన్ కూడా రాబోతోంది. దాని టైటిల్ తదితర వివరాలు ఇంకా అనౌన్స్ చేయలేదు

సిద్దార్థ్ తో గృహం తీసి మంచి హిట్ అందుకున్న మిలింద్ రావు ఇందులో కూడా చాలా డిఫరెంట్ టేకింగ్ చూపించారని అంటున్నారు ఈ సినిమాకు సంబంధించిన మరో విశేషం నిర్మాత ఎవరో కాదు. నయనతార కాబోయే భర్త విఘ్నేష్ శివన్. అంతేకాదు పాటలు కూడా తనే రాశాడట. తెలుగు కన్నా తమిళంలో ఓటిటి రిలీజులు ఎక్కువగా ఉన్నాయి. సోనీ లివ్ వచ్చాక పోటీ బాగా ఎక్కువయ్యింది. ఎటొచ్చి టాలీవుడ్ లోనే రేట్ల దగ్గర వచ్చిన పేచీలతో చిన్న సినిమాలు కూడా ఓటిటి బాట పట్టలేకపోతున్నాయి. ఇంకో వారంలో అన్ని చోట్లా థియేటర్లు పూర్తి స్థాయిలో తెరుచుకోబోతున్నాయి కనక ఎలాంటి పరిణామాలు ఎదురు కాబోతున్నాయో చూడాలి

Also Read: నీడ సినిమా రిపోర్ట్