iDreamPost
iDreamPost
స్టార్ హీరోయిన్ల మీద ఓటిటి ప్రభావం ఏ స్థాయిలో ఉందో చెప్పేందుకు ఇంత కన్నా ఉదాహరణ అక్కర్లేదేమో. నయనతార కూడా డిజిటల్ డెబ్యూ చేయబోతోంది. అది కూడా ఏదో ఆషామాషీ వెబ్ సిరీస్ లో కాదు. వందల కోట్ల బడ్జెట్ తో నెట్ ఫ్లిక్స్ నిర్మిస్తున్న బాహుబలి బిఫోర్ ది బిగినింగ్ కోసం నయన్ తో సదరు సంస్థ డీలింగ్ చేసుకున్నట్టుగా ఫ్రెష్ అప్ డేట్ ఇప్పుడు చెన్నై మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ముందు జరిగిన కథ అంటున్నారు కాబట్టి నయనతార శివగామిగా కనిపించడం దాదాపు ఖాయమే. బాహుబలి పుట్టకముందు ఆ రాజ్యంలో ఏం జరిగిందనే పాయింట్ మీద ఈ సిరీస్ మొత్తం నడుస్తుంది. ఎక్కడా ప్రభాస్ కనిపించడు.
ఇప్పటికే తమన్నా, కాజల్ అగర్వాల్, శృతి హాసన్, సాయి పల్లవి లాంటి డిమాండ్ ఉన్న హీరోయిన్లు ఓటిటి ఎంట్రీని వివిధ రూపాల్లో ఇచ్చేశారు. వచ్చే నెల రాబోతున్న నవరసతో ఈ ప్రవాహం ఇంకో స్థాయికి వెళ్లబోతోంది. ఈ లెక్కన చూస్తే రాబోయే రోజుల్లో పేరున్న క్యాస్టింగ్ అందరూ ఇటు సినిమాలు అటు ఓటిటిల షూటింగులతో మహా బిజీగా మారడంలో ఎలాంటి అనుమానం అక్కర్లేదు. ఈ బాహుబలి షూటింగ్ సెప్టెంబర్ నుంచి ప్రారంభం కాబోతోంది. మిగిలిన తారాగణం వివరాలు త్వరలోనే ప్రకటించబోతున్నారు. దర్శకుడు ఎవరన్నది కూడా గుట్టుగా ఉంచారు. గ్రాండ్ ఈవెంట్ ద్వారా ఓపెనింగ్ జరిగే అవకాశం ఉంది.
ఇప్పుడు నయనతార ఎంట్రీని బట్టి ఫ్యూచర్ లో ఈ రంగంలో ఎలాంటి మార్పులు రాబోతున్నాయో అర్థం చేసుకోవచ్చు. రెమ్యునరేషన్లు కూడా సినిమాలకు మించి ఆఫర్ చేయడం కూడా టెంప్ట్ చేయడానికి కారణంగా కనిపిస్తోంది. థియేటర్ వ్యవస్థ కుదుపులకు గురవుతున్న టైంలో చిన్న సినిమాలకు తమ టాలెంట్ ని ఋజువు చేయాలనుకుంటున్న ఔత్సాహికులకు ఓటిటి రంగం కన్నా బెస్ట్ ఆప్షన్ కనిపించడం లేదు. రాబోయే రోజుల్లో ఇది వేల కోట్ల బిజినెస్ మారడాన్ని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అక్కడి నుంచి ఇక చిన్నితెర స్మార్ట్ స్క్రీన్ లాంటి పదాల మీద చిన్న చూపు ఉండకపోవచ్చు