iDreamPost
android-app
ios-app

న్యాచురల్ గా భయపెడుతున్న ‘వి’

  • Published Jan 28, 2020 | 5:32 AM Updated Updated Jan 28, 2020 | 5:32 AM
న్యాచురల్ గా భయపెడుతున్న ‘వి’

నిన్న పోలీస్ ఆఫీసర్ గా సుధీర్ బాబు పోస్టర్ ని రిలీజ్ చేసిన వి టీమ్ ఇవాళ న్యాచురల్ స్టార్ నాని లుక్ ని విడుదల చేసింది. ముందు నుంచి ప్రచారంలో ఉన్నట్టుగా నాని ఇందులో నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్ర చేయడం ఖరారయ్యింది. లుక్ లో కూడా అదే హై లైట్ చేశారు. కోరగా తిరిగిన మీసం, చేతి వెళ్ళ మధ్య కారుతున్న నెత్తురు, పదునైన కత్తెర, ఇంకా తన దాహం తీరలేదన్నట్టు ఉన్న నాను చూపు వెరసి ఈ వి సినిమా డిఫరెంట్ ఎక్స్ పీరియన్స్ ఇవ్వడం ఖాయమన్న అభిప్రాయం కలుగుతోంది.

ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వం వహిస్తున్న విలో అదితి రావు హైదరి, నివేదా థామస్ హీరొయిన్లుగా నటిస్తుండగా జగపతి బాబు మరో కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. షూటింగ్ ఇప్పటికే పూర్తయ్యింది. నాని మొత్తానికి కొత్త మేకోవర్ కోసం ట్రై చేస్తున్నట్టు కనిపిస్తున్నాడు. గత ఏడాది జెర్సి మంచి విజయాన్నే సాధించినా కమర్షియల్ గా పెద్ద రేంజ్ కు వెళ్ళలేకపోయింది. గ్యాంగ్ లీడర్ మీద ఎన్నో ఆశలు పెట్టుకుంటే దాని ఫలితం నిరాశ కలిగించింది.

ఈ నేపథ్యంలో నానికి వి పెద్ద హిట్ కావడం చాలా అవసరం . విక్రమాదిత్యగా నాని నటిస్తున్న విలో అతను కిల్లర్ పాత్రలో కనిపించబోతున్నట్టు సమచారం. అతను ఎందుకు అలా మారవలసి వచ్చింది, గతం ఏంటి, చివరికి తనను వెంటాడుతున్న పోలీస్ కు చిక్కాడా లేదా లాంటి ప్రశ్నలకు సమాధానం మర్చి 25నే తెలుసుకోవాలి. 2020లో రిలీజ్ కాబోతున్న నాని మొదటి సినిమా ఇదే.

jojobet girişJojobet GirişJojobet GirişCasibomiptv satın alMadridbetMadridbetMadridbetkatlaCasibom GirişMarsbahis GirişCasibom Girişenbet girişHoliganbet Giriş