iDreamPost
iDreamPost
నర్సీపట్నం డాక్టర్ మళ్లీ రోడ్డున పడ్డారు. ఈసారి ఆయన చేష్టలు అందరినీ నివ్వెర పరిచాయి. మానసిక పరిస్థితి సక్రమంగా లేదా అనే సందేహాలను నిజం చేసేలా ఆయన తీరు కనిపించింది. దాంతో విశాఖ వాసులు అవాక్కయ్యారు. ఓ ఎనస్థీషియా డాక్టర్ కి ఇలాంటి పరిస్థితి రావడం పట్ల ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
నెల రోజుల క్రితం డాక్టర్ సుధాకర్ ఒక్కసారిగా వార్తల్లోకెక్కారు . నర్సీపట్నం ఏరియా ఆస్పత్రిలో విధులు నిర్వహిస్తూ ప్రభుత్వం మీద సోషల్ మీడియాలో చేసిన వ్యాఖ్యలు హల్ చల్ చేశాయి. ఆ డాక్టర్ మాటలను ఉపయోగించుకుని రాజకీయంగా టీడీపీ చేసిన డ్రామా పెద్ద దుమారం రేపింది. చివరకు ఆయన తీరు మీద తీవ్ర విమర్శలు రావడంతో సర్కారు సస్ఫెన్షన్ నిర్ణయం తీసుకుంది.
ఆ తర్వాత మళ్లీ తన కుమారుడి విషయంలో విశాఖ పోర్త్ పోలీస్ స్టేషన్ లో డాక్టర్ సుధాకర్ తీరు వివాదంగా మారింది. పోలీసుల మీద ఆయన దూకుడు ప్రదర్శించడంతో చివరకు కేసు వరకూ వెళ్లింది. తన కుమారుడు లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘించడంతో పోలీసులు బైక్ సీజ్ చేశారు. దానిని విడిపించడం కోసం వెళ్ళి నానా హంగామా చేసిన సుధాకర్ తీరు కలకలం రేపింది.
ఇక ఆ రెండు ఘటనలను మించి ఈసారి ఏకంగా రోడ్డు మీద పడే పరిస్థితి వచ్చింది. తనకు కరోనా ఉందంటూ అందరినీ బెదిరించే పరిస్థితికి దిగజారారు. విశాఖ సిటీలో కార్ లో ప్రయాణిస్తూ ఓ బైక్ ని ఢీకొట్టిన డాక్టర్ పై బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో రంగంలో దిగిన పోలీసులను సుధాకర్ బెదిరిస్తున్న తీరు వీడియో రూపంలో హల్ చల్ చేస్తోంది. నాకు కరోనా ఉందీ. మీకు అంటిస్తాను అంటూ అందరినీ బెదిరిస్తున్న ఆ డాక్టర్ తీరు విస్మయకరంగా మారింది. డాక్టర్ సుధాకర్ కి మతిస్థిమితం లేదని సాగిన ప్రచారం వాస్తవమేనని తేల్చేలా ఈ పరిణామాలు చాటుతున్నాయి.
అలాంటి సుధాకర్ వీడియోను సోషల్ మీడియలో వైరల్ చేసి, ప్రభుత్వం మీద విమర్శలు చేసిన టీడీపీ, జనసేన నేతలకు ఇప్పటికయినా వాస్తవం బోదపడుతుందా అన్నది సందేహమే. పిచ్చి చేష్టలను పట్టుకుని ప్రభుత్వాన్ని బద్నాం చేయాలని చూసిన ప్రతిపక్ష నేతలకు కాస్త హితబోధ కలిగించేలా ఈ ఉదంతం ఉందని అంతా భావిస్తున్నారు.