iDreamPost
android-app
ios-app

థియేటర్లకు రాబోతున్న నాని ?

  • Published Jul 14, 2021 | 9:32 AM Updated Updated Jul 14, 2021 | 9:32 AM
థియేటర్లకు రాబోతున్న నాని ?

ఇంకా థియేటర్లు తెరుచుకోలేదు కానీ రిలీజ్ కు సిద్ధంగా ఉన్న సినిమాలు డేట్లను ఫిక్స్ చేసుకోవడంలో తలమునకలై ఉన్నాయి. విపరీతమైన పోటీ ఉండటంతో ఎంత ఆలస్యం చేస్తే అంత రిస్క్ పొంచి ఉన్న నేపథ్యంలో ఫస్ట్ కాపీ రెడీగా ఉన్న నిర్మాతలు ఇప్పుడు తెలివిగా వ్యవహరించాల్సిన టైం వచ్చేసింది. నారప్ప లాంటి భారీ చిత్రాలు ఓటిటికి వెళ్లిపోవడం గురించి కాసేపు పక్కనపెడితే మిగిలినవాళ్లు ముందుగా స్లాట్ ని లాక్ చేసుకోవడం ద్వారా సేఫ్ గేమ్ ని ఆడేందుకు అవకాశం పెరుగుతుంది. తిమ్మరుసు, ఎస్ఆర్ కల్యాణ మండపం లాంటి చిన్న సినిమాలు ధైర్యంగా వస్తున్నప్పుడు మిగిలినవాళ్లు వెయిట్ చేయడం సబబు కాదు

ఇక లేటెస్ట్ అప్ డేట్ ప్రకారం న్యాచురల్ స్టార్ నాని టక్ జగదీశ్ ఈ జులై 30కి వచ్చే ఆలోచనను సీరియస్ గా చేస్తున్నట్టు తెలిసింది. ఎలాగూ ఆ రోజు ఒక్క తిమ్మరుసు మాత్రమే ఉంది. 27న రావాల్సిన అక్షయ్ కుమార్ బెల్ బాటమ్ దాదాపు వెనకడుగు వేసినట్టే. ఒకవేళ వచ్చినా నష్టమేమి లేదు. కాబట్టి ఓపెనింగ్స్ పరంగా నానికి చాలా బెనిఫిట్ దక్కుతుంది. సగం సీటింగ్ కేవలం ఆంధ్రప్రదేశ్ లో మాత్రమే ఉంది కనక అక్కడ వచ్చే లోటుని ఇక్కడ ఫుల్ కెపాసిటీతో తెలంగాణలో కవర్ చేసుకోవచ్చు. దానికి తోడు రెండు స్క్రీన్లు వేయాల్సిన చోట్ల కూడా టక్ జగదీశ్ కు నాలుగు దొరికే ఛాన్స్ ఉంది. ఎగ్జిబిటర్లకు సైతం వేరే ఆప్షన్ లేదు.

సో టక్ జగదీష్ రావడం లాంఛనమే అనిపిస్తోంది. మజిలీ నిన్ను కోరి ఫేమ్ శివ నిర్వాణ దర్శకత్వం వహించిన ఈ ఫామిలీ ఎంటర్ టైనర్ లో రీతూ వర్మ హీరోయిన్ గా నటించింది. తమన్ సంగీతం అందించారు. జగపతిబాబు హీరో అన్నయ్యగా ఒక కీలక పాత్ర పోషించారు. టీజర్ లాక్ డౌన్ కు ముందే వచ్చి ఆకట్టుకుంది. ఇప్పుడు టక్ జగదీశ్ తీసుకునే నిర్ణయం బట్టి నాగ చైతన్య లవ్ స్టోరీ ప్లానింగ్ మారొచ్చు. దాన్ని ఆగస్ట్ 13కి ప్లాన్ చేసుకున్నట్టు చూచాయగా తెలిసింది. ఇవి కాకుండా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్, ఇష్క్ లాంటి రెడీ టు రిలీజులు 10కి పైగానే ఉన్నాయి. మరి ఎవరు ఎవరెవరితో క్లాష్ అవుతారో చూడాలి