iDreamPost
android-app
ios-app

వెలుగు సరిపోని నక్షత్రాలు – Nostalgia

  • Published Jul 14, 2021 | 11:24 AM Updated Updated Jul 14, 2021 | 11:24 AM
వెలుగు సరిపోని నక్షత్రాలు – Nostalgia

ఏ భాషలో అయినా మల్టీస్టారర్లకుండే క్రేజ్ వేరు. ఇమేజ్ ఉన్న హీరోలు కలిసి నటిస్తున్నారంటే ఆయా అభిమానులకు ఎన్నో అంచనాలు ఉంటాయి. వాటిని బ్యాలన్స్ చేస్తూ కామన్ ఆడియన్స్ కి సైతం కనెక్ట్ అయ్యేలా కథని చెప్పగలిగినప్పుడే విజయం దక్కుతుంది. హంగులతో, తెరమీద కనిపించే ఖర్చుతో సక్సెస్ దక్కదు. ఎలాగో మీరే చూడండి. 1989 బాలీవుడ్ లో రిలీజైన ‘త్రిదేవ్’ బ్లాక్ బస్టర్ కొట్టి ఆ ఏడాది వసూళ్ల పరంగా మైనే ప్యార్ కియా, రామ్ లఖన్ ల తర్వాత మూడో స్థానం దక్కించుకుంది. సన్నీ డియోల్, జాకీ షరాఫ్, నసీరుద్దీన్ షా కాంబినేషన్ లో దర్శకుడు రాజీవ్ రాయ్ రూపొందించిన యాక్షన్ డ్రామా ప్రేక్షకులకు విపరీతంగా ఆకట్టుకుంది.

దీన్నే కొద్దిపాటి మార్పులతో నాలుగేళ్ల తర్వాత తెలుగులో తీయాలని సంకల్పించారు నిర్మాత కాట్రగడ్డ ప్రసాద్. రీమేక్ హక్కులు అఫీషియల్ గా కొన్నారో లేదో బయటికి చెప్పలేదు కానీ కథ రచయితగా వెంకట్రామ్ పేరు వేయడం అప్పట్లో విశేషంగా మాట్లాడుకునేవారు. ఫ్యామిలీస్ తో పాటు యూత్ లో ఫాలోయింగ్ ఉన్న సుమన్, యాక్షన్ ఇమేజ్ ఉన్న భానుచందర్, సాహస ఘట్టంతో వెలుగులోకి వచ్సిన అరుణ్ పాండియన్ కాంబోలో ‘నక్షత్ర పోరాటం’ టైటిల్ తో భారీ బడ్జెట్ తో తెరకెక్కించారు. బాలీవుడ్ విలక్షణ నటుడు కబీర్ బేడీని విలన్ గా టాలీవుడ్ కు పరిచయం చేసింది ఈ సినిమాతోనే.

సాగర్ దర్శకత్వం వహించేందుకు రంగం సిద్ధమయ్యింది. కొంపెల్ల విశ్వం సంభాషణలు, రాజ్ కోటి సంగీతం, మహీధర్ ఛాయాగ్రహణంతో టీమ్ సెట్ చేసుకున్నారు. రోజా, ఆమని, సింధూజ హీరోయిన్లుగా ఎంపికయ్యారు. సినిమా స్కోప్ లో తన బ్యానర్ లో దేనికీ ఖర్చు పెట్టనంతగా ప్రసాద్ దీని కోసం బడ్జెట్ కేటాయించారు. వేర్వేరు సందర్భాల్లో ఒకే విలన్ వల్ల జీవితంలో చాలా కోల్పోయిన ముగ్గురు హీరోలు కలుసుకుని అతని భరతం పట్టడం ఇందులో మెయిన్ పాయింట్. తెలుగు ఆడియన్స్ టేస్ట్ కు తగ్గట్టు చేసిన ఛేంజులు అంతగా పండలేదు. 1993 మార్చి 26న విడుదలైన నక్షత్ర పోరాటం జనాన్ని మెప్పించలేదు. ఫలితంగా హిందీలో బ్లాక్ బస్టర్ గా నిలిచిన త్రిదేవ్ తెలుగులో మటుకు డిజాస్టర్ గా మిగిలిపోయింది. మ్యూజికల్ గా ఆడియో ఒకటే బాగుండటం ఊరట