iDreamPost
iDreamPost
ప్రస్తుతం నాగార్జున అంటే చాలు గుర్తొచ్చేది బిగ్ బాస్ ఒక్కటే. అంతగా ఆయన ప్రభావం ఆ రియాలిటీ షో మీద ఉంది. పార్టిసిపెంట్స్ పరంగా, గేమ్ నడుస్తున్న తీరు పట్ల ఎన్ని విమర్శలు వచ్చినప్పటికీ ఏదో నాగ్ వల్లే దానికో అందం చందం ఉందని మాత్రం ఒప్పుకుని తీరాలి. అయితే సినిమాల ఊసు మాత్రం కింగ్ ఎక్కువ చెప్పడం లేదు. ఇటీవలే వైల్డ్ డాగ్ షూటింగ్ దిగ్విజయంగా పూర్తి చేసిన సంగతి తెలిసిందే. ఓటిటిలో డైరెక్ట్ రిలీజ్ కావొచ్చని ప్రచారం జరిగింది కానీ ఆ తర్వాత అంతా గప్ చుప్ అయిపోయింది. థియేటర్లు తెరుచుకున్నాయి కాబట్టి పరిస్థితి అంచనా వేసి నిర్ణయం తీసుకునే ఆలోచనలో నిర్మాతలు ఉన్నారు.
వీటి సంగతలా ఉంచితే నాగ్ చేయాలనుకుని ప్రకటించి మరీ అప్ డేట్ ఇవ్వని సినిమాల గురించి అభిమానుల్లో చర్చ జరుగుతోంది. ఆ మధ్య ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ఆసియన్ బ్యానర్ ఓ ప్రాజెక్ట్ ని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇది జరిగి చాలా రోజులు అయ్యింది. మళ్ళీ ఎలాంటి సమాచారం లేదు. ఇన్ సైడ్ టాక్ ప్రకారం ఇది హోల్డ్ లో పెట్టారని వినికిడి. స్క్రిప్ట్ ఇంకా సంతృప్తికరంగా రాలేదు కనక ఇంకొంత కాలం వెయిట్ చేద్దామని నాగ్ చెప్పినట్టు న్యూస్. అధికారికంగా ధ్రువీకరణ కాలేదు. ప్రవీణ్ కు గతంలోనూ రామ్ తో ఓ సినిమా పూజా కార్యక్రమాలు చేసుకున్నాక క్యాన్సిల్ అయ్యింది. ఇది అలా కాకూదనే కోరుకోవాలి.
ఇక ఎప్పటి నుంచో చెబుతూ వస్తున్న సోగ్గాడే చిన్ని నాయనా సీక్వెల్ బంగార్రాజు గురించి మౌనమే సమాధానం అవుతోంది. దర్శకుడు కళ్యాణ్ కృష్ణ ఎప్పుడో కథను రెడీ చేశాడు. ఇందులో నాగ చైతన్య కూడా నటించాల్సి ఉంది. అయినా కూడా ఇప్పటిదాకా ప్రారంభించే సూచనలు కనిపించడం లేదు. సోగ్గాడేను ఇప్పటికే అందరూ మర్చిపోయారు. ఒకవేళ ఈ సీక్వెల్ స్టార్ట్ చేసినా అంత ఈజీగా క్రేజ్ రాదు. అందులోనూ మన్మథుడు 2 డిజాస్టర్ తర్వాత కథల విషయంలో నాగ్ చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నాడు. అది కూడా ఆలస్యానికి కారణంగా చెప్పుకోవచ్చు. మొత్తానికి ఈ రెండు సినిమాల సస్పెన్సు ఎప్పుడు వీడుతుందో